మూవీ రివ్యూ..

వివేకానంద వైరల్ మూవీ రివ్యూ..

ఆహ లో విడుదలవుతున్న మలయాళ సినిమా ‘వివేకానందన్ వైరల్’. మలయాళంలో క్రితం ఏడాది జనవరి 19వ తేదీన విడుదలైంది. షైన్ టామ్ చాకో కథానాయకుడిగా నటించాడు. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన చేరువయ్యాడు. నిన్నటి నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుంది.

కథ: వివేకానందన్ టౌన్లో ఉన్న ఒక బ్యాంకులో ఏరియా మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన భార్య సితార పంచాయితీ ఆఫీసులో పనిచేస్తూ ఉంటుంది. వివేకా తల్లిదండ్రులు విడిపోయి చాలాకాలమే అవుతుంది. అయినా వాళ్ల మధ్య ప్రేమానురాగాలు అలాగే ఉంటాయి. వివేకా టౌన్లోనే ఒక రూమ్ రెంట్ కి తీసుకుని ఉంటూ, వీకెండులో మాత్రమే ఇంటికి వస్తుంటాడు.వివేకాలో శృంగారపరమైన ఆలోచనలు .. కోరికలు ఎక్కువ. అందువలన అతను రకరకాల లేహ్యాలు వాడుతూ ఉంటాడు. శృంగార సమయంలో అతని ప్రవర్తన రాక్షసంగా ఉండటంతో భార్య సైతం భయపడిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే అతను టౌన్లో తాను అద్దెకి ఉండే ఇంటి ఓనర్ కూతురు ‘డయానా’ను ముగ్గులోకి దింపుతాడు. సితారకి తెలియకుండా డయానాతో సహజీవనం కొనసాగిస్తూ ఉంటాడు. ఆమెను కూడా శారీరకంగా హింసిస్తూ ఉంటాడు. తనతో పాటు బస్సులో ప్రయాణించే ఒక యువతినీ .. బ్యాంకు పనిపై తనని కలవడానికి వచ్చిన ‘దివ్య’ను ముగ్గులోకి దింపడానికి ప్రయత్నాలు చేయడం మొదలుపెడతాడు. అతని స్వభావాన్ని అర్థం చేసుకున్న డయానా అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం ఆమె ఏం చేస్తుంది? సితార సపోర్టును కూడా కోరాలని అనుకున్న ఆమెకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? వివేకా నందన్ ఏ విధంగా వైరల్ అవుతాడు? అనేది కథ.

114199620

విశ్లేషణ: కామెడీ డ్రామా జోనర్లో కమల్ సిద్ధం చేసుకున్న కథ ఇది. పెళ్లి తరువాత కూడా కొంతమంది శృంగారపరమైన ఆలోచనలతో అమ్మాయిల వెంటపడటం .. వాళ్ల పట్ల వికృతంగా పరవర్తించడం చేస్తుంటారు. తమకి తాము రొమాంటిక్ హీరోలుగా ఊహించుకుంటూ పక్కదారులు పడుతూ ఉంటారు. అలాంటి స్వభావం కలిగిన ఈ కథలోని నాయకుడికి అమ్మాయిలంతా కలిసి ఎలా గుణపాఠం చెప్పారనే ఈ కథను దర్శకుడు తనదైన స్టైల్లో తెరకెక్కించాడు.మలయాళంలో ఇంతవరకూ షైన్ టామ్ చాకో చేస్తూ వచ్చిన పాత్రలు వేరు. రొమాన్స్ తో కూడిన ఈ పాత్రలో విపరీత పోకడలు ఉంటాయి. అందువలన దర్శకుడు ఆయనను ఎంచుకున్నాడనే విషయం మనకి అర్థమవుతుంది. హీరో అమ్మాయిలకు వల విసిరే ప్రయత్నాలతో ఫస్టాఫ్ సరదాగానే సాగిపోతుంది. వివేకానందన్ కి బుద్ధి చెప్పాలని అమ్మాయిలంతా నిర్ణయించుకోవడం సెకండాఫ్ గా నడుస్తుంది. వివేకానందన్ కి వాళ్లు బుద్ధి చెప్పడానికి ఏ మార్గాన్ని ఎంచుకుంటారా? అని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశనే ఎదురవుతుంది. అక్కడి నుంచి కథలో వినోదం లోపించి .. హడావిడి మాత్రమే కనిపిస్తుంది. సెకండాఫ్ లో కథ దాదాపు ఒక ఇంట్లో .. నాలుగు గోడల మధ్య పరిమితమైపోతుంది. నిజానికి ఈ తరహా కథలో మంచి కామెడీని వర్కౌట్ చేయవచ్చు. కానీ అలాంటి ప్రయత్నమేదీ కనిపించదు.

Related Posts
విలన్‌గా బ్రహ్మానందం.. థియేటర్‌లు షేక్‌ అవుతాయా ?
విలన్‌గా బ్రహ్మానందం.. థియేటర్‌లు షేక్‌ అవుతాయా?

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇప్పటివరకు వెండితెరపై అనేక పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. ప్రధానంగా కామెడీ పాత్రల్లో మెప్పించిన ఆయన, కొన్నిసార్లు సీరియస్ రోల్స్‌ తోనూ ప్రేక్షకుల Read more

యంగ్ హీరో గుండెపోటుతో మరణం.
యంగ్ హీరో గుండెపోటుతో మరణం.

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మాయదారి గుండెపోటు మరో యువ నటుడిని బలి తీసుకుంది. భవిష్యత్తులో ఎంతో వెలుగొందే అవకాశం ఉన్న భోజ్‌పురి Read more

మీనాక్షి : తనతో చేసిన హీరో ల గురించి ఏమందంటే
meenakshi chaudary

ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యంత చర్చగత్తే ఉన్న హీరోయిన్లలో ఒకరు మీనాక్షి చౌదరి. ఈ ఏడాది ఆమె వరుసగా హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. సంక్రాంతికి ‘గుంటూరు Read more

 తమిళ హీరో విజయ్ కి కంగ్రాట్స్ చెప్పిన పవన్ కల్యాణ్
vijay pawan kalyan

తమిళ సినీ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అతను గతంలోనే తన రాజకీయ లక్ష్యాలను ప్రకటించినా, ఇటీవల విజయ్ Read more