ఇటీవల కాలంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఘటనలు ఎక్కువయ్యాయి. గతంలో ఇండియన్ సినిమాలు కేవలం దేశీయ ప్రేక్షకులకు పరిమితమయ్యే పరిస్థితి ఉండగా, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో విజయాలను సాధిస్తున్నాయి. అయితే, కంటెంట్ లేకుండా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తే ఆర్థికంగా నష్టాలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

భారతీయుడు 2 – భారీ అంచనాలకు తక్కువ వసూళ్లు!
శంకర్ దర్శకత్వం వహించిన కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 భారీ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ సాధించలేకపోయింది. కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ‘కంగువా’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ‘బడే మియా చోటే మియా’ కూడా భారీ నష్టాలను మిగిల్చిన మరో సినిమా. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మైదాన్’, భారత జాతీయ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగిలిపోయింది. రూ 250 కోట్లు ఖర్చు పెడితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూలు చేసింది మాత్రం రూ.68 కోట్లు మాత్రమే. అది కూడా నెట్ కలెక్షన్లు. అంటే ఈ సినిమాకు రూ.50 కోట్లు కూడా షేర్ రాలేదు. ఈ లెక్కన పెట్టిన పెట్టుబడిలో కనీసం 30 శాతం డబ్బులు కూడా తిరిగి రాలేదు.అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయినప్పటికీ, ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.