Jeans history: జీన్స్ ప్యాంట్ కుడి వైపు ఉండే చిన్న జేబు ఎందుకు ఉందనే ప్రశ్న ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. చూడడానికి చిన్నగా ఉండే ఈ జేబులో పెద్దగా ఏమీ పెట్టుకోవడం సాధ్యం కాదు. అయినప్పటికీ, దాని వెనుక ఉన్న చరిత్ర చాలా ఆసక్తికరమైనది.
Read Also: Healthy Living: ‘బ్లూ జోన్స్’ ప్రాంతాల ఆరోగ్య రహస్యాలు

100 ఏళ్ల చరిత్ర ఉన్న జీన్స్ చిన్న జేబు
జీన్స్ ప్యాంట్లు తొలిసారిగా 19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్నప్పుడు, అప్పట్లో చేతికి ధరించే గడియారాలు ఎక్కువగా ఉపయోగంలో లేవు. ఆ కాలంలో చాలా మంది పాకెట్ వాచ్‌లనే ఉపయోగించేవారు. అలాంటి చిన్న గడియారాలను భద్రంగా(watches safe) ఉంచేందుకు వీలుగా ఈ చిన్న జేబును ప్రత్యేకంగా రూపొందించారు. దీంతో పనికోసం తిరిగే కార్మికులు తమ గడియారాలను సులభంగా మోసుకెళ్లేవారు.

కాలక్రమేణా పాకెట్ వాచ్‌ల(Pocket watches) స్థానాన్ని చేతి గడియారాలు తీసుకున్నాయి. అయినప్పటికీ, జీన్స్ డిజైన్‌లో ఈ చిన్న జేబు ఒక సంప్రదాయంగా మారింది. జీన్స్ తయారీదారులు దాని అసలు అవసరం తగ్గినా, క్లాసిక్ లుక్‌ను కాపాడేందుకు ఈ చిన్న జేబును ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది దీనిని నాణేలు, చిన్న కీలు, యూఎస్‌బీ డ్రైవ్‌లు వంటి చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఒక చిన్న డిజైన్ అయినప్పటికీ, జీన్స్ చరిత్రను గుర్తు చేసే ముఖ్యమైన గుర్తుగా ఈ జేబు నిలుస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: