తెలంగాణలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గ్రూప్ 2 (Group 2) నియామకాల ప్రక్రియ చివరి దశకు చేరింది.ఈ క్రమంలో 783 పోస్టులపై ఫలితాలను త్వరలోనే ప్రకటించనుందని అధికారులు తెలిపారు. ఈ నియామకాల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి, వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్షల్లో పాల్గొన్నారు. ప్రతీ అభ్యర్థి తన భవిష్యత్తు ఉద్యోగ అవకాశాల కోసం చాలా ఆసక్తిగా దీక్షతో సిద్ధమయ్యారు.
Mounika: పంక్చర్ షాప్ ఓనర్ కూతురు డీఎస్పీ జాబ్ కొట్టింది
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో.. టీజీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన (Certification Verification) కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసింది. సెప్టెంబర్ 28వ తేదీన మొత్తం 783 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు కమిషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు విడుదల కావడం.. ఎంపికైన వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించడం వంటి శుభపరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. గ్రూప్ 2 తుది ఫలితాల (Group 2 final results) విడుదల కూడా వేగవంతమైంది. గ్రూప్ 1 (Group 1)వ్యవహారంలో ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో.. మిగిలిన నియామక ప్రక్రియలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది.
ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా వివిధ కీలక విభాగాలలో మొత్తం 783 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు తీవ్రంగా శ్రమించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: