Mohammed Siraj, భారత ఫాస్ట్ బౌలర్, ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన మూడవ టెస్టు మ్యాచ్‌లో ICC ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు గుర్తించబడి 15% మ్యాచ్ ఫీజు జరిమానా విధించబడింది. అంతేకాకుండా ఒక డీమెరిట్ పాయింట్ కూడా అతని రికార్డులో జోడించబడింది.ఈ ఘటన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరవ ఓవర్లో చోటుచేసుకుంది. Siraj తన బౌలింగ్‌లో బెన్ డకెట్ ను ఔట్ చేసిన తర్వాత అతని దిశగా వెళ్లి ఉత్సాహంగా అరిచాడు.ఇది ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని (Article 2.5) ఉల్లంఘనగా పరిగణించబడింది. ఈ ఆర్టికల్ ప్రకారం, ఔటైన బ్యాట్స్‌మన్‌ను ఉద్దేశించి దురుసు భాష, సంకేతాలు, శారీరక చర్యలు చేయడం నిషిద్ధం. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో డకెట్ 12 రన్స్ చేసి ఔటయ్యాడు. మూడవ టెస్టు మ్యాచ్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 193 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా 4 వికెట్లు కోల్పోయి 58 రన్స్ చేసింది. ఇవాళ అయిదో రోజు ఆట కీలకం కానున్నది.
మ్యాచ్ నిషేధం
నాలుగో రోజు ఆట అనంతరం అంపైర్ల ఫిర్యాదుతో విచారణ జరిపిన మ్యాచ్ రిఫరీ నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నాడు. మ్యాచ్ రిఫరీ (Match Referee) ముందు సిరాజ్ తన తప్పిదాన్ని అంగీకరంచాడు. గత 24 నెలల్లో సిరాజ్ చేసిన రెండో తప్పిదమిది. ప్రస్తుతం అతను ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్స్ ఉన్నాయి. రెండేళ్ల కాలంలో ఆటగాడి ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్స్ ఉంటే మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. సిరాజ్ ఖాతాలో మరో రెండు పాయింట్స్ చేరితే నిషేధం పడుతుంది. టెస్ట్‌ల్లో భారత ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు కింద బీసీసీఐ (BCCI) రూ. 15 లక్షలు చెల్లిస్తోంది. ఇందులో రూ. 15 శాతం కోత అంటే రూ. 2.25 లక్షలు. అయితే ఇది భారత ఆటగాళ్లకు లెక్కే కాదని నెటిజన్లు, మాజీ క్రికెటర్లు అంటున్నారు.
మొహమ్మద్ సిరాజ్ అంతర్జాతీయ కెరీర్ ఎప్పుడు మొదలైంది?
టీ20 డెబ్యూ – నవంబర్ 2017లో న్యూజిలాండ్‌తో,వన్డే డెబ్యూ – జనవరి 2019లో ఆస్ట్రేలియాతో,టెస్ట్ డెబ్యూ – డిసెంబర్ 2020లో ఆస్ట్రేలియాతో.
సిరాజ్ టెస్ట్ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఏది?
2021లో ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ టెస్ట్‌లో 5 వికెట్లు తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టూర్‌లోనే తన తండ్రి మరణించినా దేశం కోసం ఆడటం కొనసాగించాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: World Chimpanzee Day 2025: నేడు ప్రపంచ చింపాంజీ దినోత్సవం