శశిథరూర్ తో నా ఫోటో చూసి కాంగ్రెస్కు నిద్రపట్టదు: మోదీ
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని విపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తనతో కలిసి వేదిక పంచుకోవడాన్ని ప్రస్తావిస్తూ మోదీ, “శశిథరూర్‌తో ఉన్న నా ఫోటో చాలామందికి నిద్రలేని రాత్రులు మిగులుస్తుంది” అని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం చమత్కారం మాత్రమే కాదు, రాజకీయ సంకేతాలను కూడ ఉటంకిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ కార్యక్రమానికి ఎంపీ శశిథరూర్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ హాజరయ్యారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో ఓడరేవుల పాత్ర కీలకమైందని తెలిపారు. విజయన్ జిల్లాలో రూ. 8,867 కోట్లతో నిర్మించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవును మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ ఓడరేవు ద్వారా కేవలం కేరళకే కాదు, దేశ అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని వివరించారు.

Modi : విజింజం ఓడరేవు ప్రారంభంలో శశిథరూర్–మోదీ సంధాన సాన్నిహిత్యం
మోదీ మాట్లాడుతూ, గత 10 ఏళ్లలో భారత ఓడరేవుల సామర్థ్యం రెట్టింపు అయిందని, టర్నరౌండ్ సమయం 30% తగ్గిందని తెలిపారు. ప్రపంచంలోని తొలి మూడు నావిక దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. మునుపటి కాలంలో 75% షిప్పింగ్ కార్యకలాపాలు విదేశీ ఓడరేవుల ద్వారా జరిగి, దేశానికి భారీగా ఆదాయం నష్టమైందని అన్నారు.ఈ సందర్బంగా శశిథరూర్ కూడా ప్రధానిని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రధాని వచ్చినప్పుడు తన నియోజకవర్గ ఎంపీగా సాదరంగా ఆహ్వానించడంలో తప్పేమీ లేదని శశిథరూర్ పేర్కొన్నారు. అయితే గత కొన్ని నెలలుగా థరూర్ కాంగ్రెస్ నేతృత్వంపై అసంతృప్తిగా ఉన్నారని, కేంద్రమంత్రులతో కలిసి దిగిన సెల్ఫీలు, విదేశాంగ విధానంపై ప్రశంసలు, ఇప్పుడు మోదీతో వేదిక పంచుకోవడం.మొత్తానికి, మోదీ చేసిన వ్యాఖ్యలు, థరూర్‌తో కలిసి వేదిక పంచుకోవడం, ఓడరేవుల ప్రారంభం వంటి అంశాలు కేరళ రాజకీయాల్లో కొత్త మలుపుకు సంకేతాలుగా మారుతున్నాయి. అలాగే దేశ అభివృద్ధిలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం కీలకమని మోదీ అభిప్రాయపడ్డారు. భారత ఓడరేవుల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఈ కార్యక్రమంలో స్పష్టమైంది.
Read More : Miss World: ఘనంగా నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలు..హైదరాబాద్ కు చేరుకున్న సిబ్బంది