Modi government has brought a new scheme for women named Swarnima

‘స్వర్ణిమ’ పేరుతో మహిళలకు కొత్త పథకం తీసుకొచ్చిన మోడీ సర్కార్‌

న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పథకాలను గతంలో కూడా ప్రవేశపెట్టారు.

Advertisements

ప్రస్తుతం కూడా తీసుకువస్తున్నారు. తాజాగా ‘స్వర్ణిమ’ పేరుతో ఓ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకంద్వారా వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉన్న పేద మహిలలకు రూ.2 లక్షల రుణం లభిస్తుంది. ఏడాదికి వడ్డీ కేవలం ఐదుశాతం పడుతుంది. దీనివల్ల ఆర్థికంగా వెనకబడినవర్గాలకు చెందిన మహిళలు నిలదొక్కుకునే అవకాశం ఏర్పడటమే కాకుండా మరో 10 మందికి ఉపాధి కల్పిస్తారనేది ప్రధానమంత్రి అభిప్రాయంగా ఉంది.

జాతీయ బీసీల ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NBCFDC) ఈ పథకాన్ని పరిచయం చేస్తోంది. స్టేట్ చాన్నెలైజింగ్ ఏజెన్సీలు (SCAs) నోడల్ ఏజన్సీలుగా వ్యవహరిస్తాయి. రూ.2 లక్షల రుణం పొందే మహిళలు అంతకంటే ఎక్కువ కావాలంటే సొంతంగా పెట్టుబడి పెట్టుకోవాలి. తాను స్థాపించదలుచుకున్న ప్రాజెక్టు వ్యయం రూ.2 లక్షల వరకు ఉండాలి. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునేవారి వయసు 18 నుంచి 55 సంవత్సరాల్లోపు ఉండాలి. తప్పనిసరిగా పారిశ్రామికవేత్తలైనవారే దీనికి దరఖాస్తు చేసుకోవాలి. వారి కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల కంటే తక్కువగా ఉండాలి.

ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్టు సైజ్ ఫొటో, కుల ధ్రువీకరణ పత్రాలు దగ్గరుండాలి. తమకు సమీపంలో ఉండే ఎస్ సీఏ కార్యాలయానికి వెళ్లాలి. అది ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు అడ్రస్ లో తెలుసుకోవాలి. తమకు ఎంత రుణం కావాలి? ఏ విధంగా శిక్షణ కావాలి అనే విషయాలను వివరించి చెప్పాలి. పైన చెప్పిన పత్రాలన్నింటినీ సమర్పించాలి. అధికారులు తమకు అందిన దరఖాస్తులను అన్నిరకాలు పరిశీలించిన తర్వాత అర్హులైనవారికి రుణాన్ని మంజూరు చేస్తారు.

Related Posts
Israel: హమాస్‌పై విరుచుకుని పడుతున్న ఇజ్రాయెల్: 220 మంది హతం
హమాస్‌పై విరుచుకుని పడుతున్న ఇజ్రాయెల్: 220 మంది హతం

గాజాపై ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు మంగళవారం భీకర దాడికి దిగాయి. జనవరి19న కాల్పుల విరమణ మొదలైన తరువాత ఇజ్రాయెల్ ఈ స్థాయిలో హమాస్‌పై వైమానిక దాడికి దిగడం Read more

ఇదే నా చివరి ఎన్నికల సమావేశం :రాజీవ్‌ కుమార్‌
Rajiv Kumar

సీఈసీగా ఇదే నా చివరి ఎన్నికల మీడియా సమావేశమని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసినదే. ఢిల్లీ ఎన్నికల Read more

కన్నడ నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో సంచలన విషయాలు
రన్యారావు కేసులో బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు

కన్నడ నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయ్‌. దుబాయ్‌ నుంచి బెంగళూర్‌కి గోల్డ్‌ స్మగ్లింగ్‌ వెనక ప్రముఖుల పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. Read more

Hansika : గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన నటి హన్సిక
Actress Hansika approaches High Court in domestic violence case

Hansika: ప్రముఖ నటి హన్సిక తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టేయాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సోదరుని Read more

×