ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) విశాఖపట్నం నగరానికి ఈ రోజు సాయంత్రం చేరుకున్నారు. విమానాశ్రయం(Vizag Airport)లో గవర్నర్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
యోగా దినోత్సవం కోసం మోదీ పర్యటన
ఇంతటి గౌరవంతో ప్రధాని మోదీ ఈసారి విశాఖను సందర్శించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. రేపు (జూన్ 21) జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జరుగనున్న “యోగాంధ్ర 2025” కార్యక్రమంలో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిర్వహించనున్న ఈ వేడుకలు యోగా చరిత్రలో గిన్నిస్ రికార్డు స్థాయిలో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.
రాత్రికి విశాఖలో బస
ప్రధాని మోదీ ఇవాళ రాత్రికి విశాఖలోనే బస చేయనున్నారు. ఆయన రాకతో నగరమంతటా ఉత్సాహం నెలకొంది. ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రధాని స్వాగతానికి తరలివచ్చారు. విశాఖపట్నం నగరంలోని ముఖ్య రహదారులన్నీ పూలతో అలంకరించబడ్డాయి. మోదీ పర్యటనతో నగరానికి దేశ వ్యాప్తంగా ప్రాధాన్యత లభించిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Yoga Day : రేపు 191 దేశాల్లో యోగా డే ఈవెంట్లు