Narendra Modi: దేశ అభివృద్ధిలో సామాజిక మార్పు ఎంత ముఖ్యమో, గ్రామీణ మహిళల శ్రమ, ఆవిష్కరణలు ఎంత విలువైనవో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 123వ మన్‌కీ బాత్ (Manki Baat) కార్యక్రమంలో హైలైట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన ఆదివాసి మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్లు – ‘భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్’ — ప్రస్తుతం దేశాన్ని దాటి లండన్ వరకు ఎగుమతి అవుతుండటం గర్వకారణమని ఆయన తెలిపారు.

భద్రాచలం మహిళల మిల్లెట్ మిషన్
మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తున్న తెలంగాణలోని భద్రాచలం ప్రాంత మహిళలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భద్రాచలంలోని ఆదివాసి మహిళలు ‘భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్’ పేరిట బిస్కెట్లు తయారు చేస్తున్నారని అవి హైదరాబాద్ నుంచి లండన్‌కు కూడా ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు.
40,000 శానిటరీ నాప్‌కిన్లు – మహిళల సామాజిక చైతన్యం
మండలంలోని మహిళలు కేవలం ఆహార పదార్థాల తయారీతో పరిమితం కాకుండా, సామాజిక అవసరాలను గుర్తించి, మూడు నెలల్లో 40,000 శానిటరీ నాప్కిన్లను తయారు చేసి విక్రయించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు.
సామాజిక రక్షణ పథకాల విస్తృతి – 95 కోట్ల మందికి లబ్ధి
మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ స్పష్టంగా తెలిపారు. గతంలో 2015 నాటికి సామాజిక రక్షణ పథకాల పరిధిలో ఉన్నవారు కేవలం 25 కోట్లు మాత్రమే. భారత జనాభాలో 64 శాతం కన్నా ఎక్కువ మంది దాదాపు 95 కోట్లమంది ఏదో ఒక సామాజిక రక్షణ పథకంతో లబ్ధి పొందుతున్నట్లు అంతర్జాతీయ కార్మికసంస్థ తెలిపిందని ప్రధాని మోదీ వివరించారు. 2015లో సామాజిక రక్షణ ఫలాలు కేవలం 25 కోట్ల మందికి అందేవని గుర్తుచేశారు.
ట్రాకోమా వ్యాధి నుండి భారత విముక్తి – WHO ప్రకటన
శాశ్వత అంధత్వానికి దారితీసే ట్రాకోమా వ్యాధి నుంచి భారత్ పూర్తిగా విముక్తి పొందినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ-WHO నిర్ధరించిందని 123వ మన్‌కీబాత్ ఎపిసోడ్‌లో మోదీ తెలిపారు.
అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం
చాలా కాలం తర్వాత తిరిగి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైందన్న ప్రధాని మోదీ, యాత్రికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తవడాన్ని మన్‌కీ బాత్‌లో ప్రస్తావించిన ప్రధాని, ఎమర్జెన్సీపై పోరాడిన బాబూ జగ్జీవన్ రామ్ వంటి వారిని మనం స్మరించుకోవాలనీ అది రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తుందన్నారు.
Read also: Mahua Moitra: విద్యార్థినిపై అత్యాచారం..తన పార్టీ నేతలకు మహువా మొయిత్రా పరోక్ష హెచ్చరిక