हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Kavitha Letter : ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

Sudheer
Kavitha Letter : ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha), ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఓ కీలక లేఖ రాసారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన అనంతరం ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలు చట్ట విరుద్ధంగా చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేయబడ్డాయని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని విమర్శించారు. భద్రాచలం రామాలయ ప్రాంతంలోని యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

రామాలయ భూములపై ఆక్రమణల ఆందోళన

కవిత లేఖలో మరో ముఖ్య అంశంగా భద్రాచలం శ్రీరాముల వారి భూముల పరిరక్షణను ప్రస్తావించారు. పురుషోత్తపట్నం రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ భూములు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటంతో, రామాలయానికి చెందిన భూములపై అక్రమ కబ్జాలు కొనసాగుతున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కబ్జాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆలయ అధికారులు భౌతిక దాడులకు గురవుతున్నారని, ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని మసకబార్చేలా ఉన్నాయని ఆమె హెచ్చరించారు.

ప్రజల ఆవేదన, మానవతా దృష్టితో నిర్ణయం తీసుకోండి

విలీనమైన ఐదు గ్రామాల్లో ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రాథమిక సేవలకు నానా ఇబ్బందులు పడుతున్నారని కవిత లేఖలో తెలిపారు. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సేవలు పొందాల్సిన పరిస్థితిలో ప్రజలు ఉన్నారని ఆమె వాపోయారు. భద్రాచలంలోని రాముల వారి ఆలయ పునాదులు మరియు అక్కడి ప్రజల ఆవేదనను గౌరవించి, మానవతా దృష్టితో తెలంగాణలో ఐదు గ్రామాల విలీనానికి చంద్రబాబు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, రాజకీయ లబ్దిని కాదని, రాముని భక్తులను కాపాడాలని ఆమె అభిప్రాయపడ్డారు.

Read Also : Adulterated Toddy: కల్తీ కల్లు ఘటనలో ఆరుగురికి చేరిన మృతుల సంఖ్య

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

తిరుమల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

ఏపీలో ఖరీదైన అరుదైన ఖనిజాలు గుర్తింపు

ఏపీలో ఖరీదైన అరుదైన ఖనిజాలు గుర్తింపు

శ్రీశైలం వెళ్లే భక్తులకు పండగే.. అరగంటలోనే దర్శనం

శ్రీశైలం వెళ్లే భక్తులకు పండగే.. అరగంటలోనే దర్శనం

కార్మికులకు సంక్షేమ పథకాలు మళ్లీ ప్రారంభం

కార్మికులకు సంక్షేమ పథకాలు మళ్లీ ప్రారంభం

తెరచుకున్న బంగారు డాలర్ల అమ్మకాల కౌంటర్

తెరచుకున్న బంగారు డాలర్ల అమ్మకాల కౌంటర్

ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ‘బాకీకి భూమి’ అమలు చేయండి

ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ‘బాకీకి భూమి’ అమలు చేయండి

అంతర్రాష్ట్ర బదలీలకు ఎపి ప్రభుత్వం సానుకూలం

అంతర్రాష్ట్ర బదలీలకు ఎపి ప్రభుత్వం సానుకూలం

శ్రీశైలానికి నకిలీ నెయ్యి సరఫరా అయింది: చైర్మన్ పట్టాభిరామ్

శ్రీశైలానికి నకిలీ నెయ్యి సరఫరా అయింది: చైర్మన్ పట్టాభిరామ్

డాక్టర్ దీపికా మృతి కేసులో.. వెలుగులోకి సంచలన విషయాలు

డాక్టర్ దీపికా మృతి కేసులో.. వెలుగులోకి సంచలన విషయాలు

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్న బొత్స అనూష

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్న బొత్స అనూష

తొక్కిసలాట ఘటన నివేదిక బుట్టదాఖలేనా?

తొక్కిసలాట ఘటన నివేదిక బుట్టదాఖలేనా?

ఆదివాసీల దశాబ్దాల కలను సాకారం చేసిన చంద్రబాబు

ఆదివాసీల దశాబ్దాల కలను సాకారం చేసిన చంద్రబాబు

📢 For Advertisement Booking: 98481 12870