MLC Kavitha tweet on tunnel accident

టన్నెల్ ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్

ప్రమాదంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెంటనే స్పందించాలి

హైదరాబాద్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శ్రీ శైలం ఎడమ కాలువ గట్టు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదం ట్వీట్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెంటనే స్పందించాలని పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదం ఎలా జరిగిందో తేల్చాలని కవిత ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు. ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ పై కప్పు కూలిన ఘటనలో కూలీలు గాయపడటం అత్యంత దురదృష్టకరమన్నారు.

Advertisements
టన్నెల్ ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత

దీనికి ఎవరు బాధ్యులు?

కేసీఆర్‌ హయాంలో 10 కి.మీ. మేర టన్నెల్‌ తవ్వారని..ఏనాడూ ఇటువంటి ప్రమాదం జరగలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 4 రోజుల కిందనే పనులు మొదలు పెట్టిందని..అంతలోనే ఈ పెను ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యులని? కవిత అడిగారు. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఈ ఘటనపై స్పందించాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు. ఇంకా 9 కి.మీ.లకు పైగా టన్నెల్‌ తవ్వాల్సి ఉందని.. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు.

ఆకస్మాతుగా కూలిన పైకప్పు

కాగా, ఈరోజు ఉదయం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్‌ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి షిఫ్ట్‌లో సుమారు 50 మంది కార్మికులు సొరంగంలోకి వెళ్లారు. ఉదయం 8.30 గంటల సమయంలో కార్మికులు పని చేస్తుండగా.. ఆకస్మాతుగా పైకప్పు కూలి మట్టిపెల్లలు విరిగి పడ్డాయి. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు

Related Posts
నేడు గ్రూప్-2 ఫలితాలు
group2 exam

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలను టీఎస్‌పీఎస్సీ (TSPSC – తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్) నేడు అధికారికంగా విడుదల చేయనుంది. 783 ప్రభుత్వ Read more

భారత్-యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం
భారత్-యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం

యూరోపియన్ యూనియన్ (EU) భద్రత, రక్షణ, వాణిజ్య రంగాల్లో భారత్‌తో సహకారం పెంచేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలో, EU చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ Read more

జన్వాడలో ఫాంహౌస్ చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్ ను విడుదల చేయాలి – రఘునందన్
raghunandan rave party

సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు జన్వాడ ఫామ్ హౌస్ పై నిర్వహించిన దాడి రాజకీయ ఉత్కంఠను రేపింది. రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి Read more

గుస్సాడీ క‌న‌క‌రాజు మృతిపై సీఎం దిగ్భ్రాంతి.. అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు
CM is shocked at the death of Gussadi Kanakaraju. Funeral with official formalities

హైదరాబాద్‌: కొమ‌రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలానికి చెందిన గుస్సాడీ నృత్య కళాకారుడు, ప‌ద్మ‌శ్రీ క‌న‌కరాజు, అనారోగ్యంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు Read more

×