kavitha telangana thalli

తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారు? – ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం పై BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తి నింపిన రూపాన్ని విగ్రహంగా మలుచుకున్నామని, ఇప్పుడు ఆ రూపాన్ని మార్చడాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రేరేపిత చర్యగా అభివర్ణించారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌పై సీఎం రేవంత్ కు అవగాహన లేదని ఆరోపించారు. “ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన వారికి ఈ రూపం ప్రత్యేకమైనది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా భారత్ మాత రూపాన్ని గెజిట్‌లో చేర్చలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహంపై జీఓ ఇవ్వడం దారుణం” అని విమర్శించారు.

కాంగ్రెస్ సర్కారు పూర్తిగా పార్టీ ప్రయోజనాలకే మొగ్గుచూపుతోందని, తెలంగాణవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందని కవిత మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం అందరికీ స్ఫూర్తిదాయకమైందని, దానిపై జీఓ ఇచ్చే స్థాయికి దిగజారడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. తెలంగాణ తల్లి రూపం ఉద్యమానికి ప్రాణస్ఫూర్తి. అలాంటి గుర్తింపును మార్చే ప్రయత్నం చరిత్రకే అవమానం అని అన్నారు.తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారు? – ఎమ్మెల్సీ కవిత

Related Posts
‘నమశ్శివాయ’ అంటే ఏంటో తెలుసా?
Lord Shiva at Murudeshwar

హిందూ ధర్మంలో పవిత్రమైన మంత్రాల్లో 'ఓం నమశ్శివాయ' కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మంత్రాన్ని పంచాక్షరి మంత్రం గా పిలుస్తారు, ఎందుకంటే దీనిలో 'న, మ, Read more

కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎంపిక
భారత్-కెనడా సంబంధాల్లో మార్పు? – మార్క్ కార్నీ

కెనడా నూతన ప్రధాన మంత్రిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. లిబరల్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలతో పాటు ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్టు జస్టిన్ ట్రూడో జనవరిలో ప్రకటించిన Read more

NXP AIM 2024లో అత్యుత్తమ స్థానం పొందిన కెఎల్‌హెచ్ అజీజ్ నగర్ కు చెందిన “బ్రెయినీ బాట్స్”
vaa 1

హైదరాబాద్‌: తమ బిటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులతో కూడిన "బ్రెయినీ బాట్స్" టీమ్‌ NXP AIM 2024 పోటీలో Read more

బైడెన్‌ నిర్ణయం: ట్రంప్ అధికారంలోకి రాకముందు ఉక్రెయిన్‌కు కీలక మద్దతు
biden zelensky

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు, ఇది ఉక్రెయిన్‌కు మిత్ర దేశం నుండి మరింత మద్దతును అందించడానికి Read more