Mlc kavitha comments on cm revanth reddy

ఎన్నికల ముందు ఓ మాట.. ఎన్నికలలో గెలిచాక ఓ మాట: కవిత

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని కవిత ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించి.. ఇప్పుడు రైతులను అప్పు చెల్లించాలంటూ వేధించడం, రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నికలలో గెలిచాక మరో మాట.. ఇదీ రేవంత్ రెడ్డి గారి రెండు నాల్కల ధోరణి అంటూ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.

” ఎన్నికల ముందు ఓ మాట.. ఎన్నికలలో గెలిచాక మరో మాట.. ఇదీ రేవంత్ రెడ్డి గారి రెండు నాల్కల ధోరణి. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లిలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

రుణాలు మాఫీ చేసి అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, డబ్బులు కట్టాలంటూ అంకోల్ తండాలో రైతులపై ఒత్తిడి తీసుకురావడం, బలవంతంగా భూముల వేలానికి ప్రయత్నించడం నియంతృత్వ పాలనను తలపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించి.. ఇప్పుడు రైతులను అప్పు చెల్లించాలంటూ వేధించడం , రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనం.” అంటూ ట్వీట్‌ చేశారు.

Related Posts
పరువు నష్టం కేసు..రాహుల్ గాంధీకి బెయిల్
Defamation case..Bail for Rahul Gandhi

న్యూఢిల్లీ: విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బిగ్ రిలీఫ్ దక్కింది. పరువు నష్టం కేసులో పుణె కోర్టు ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. 2023 Read more

ఏఐ ఊబకాయం రిస్క్ డిటెక్టర్
ఏఐ ఊబకాయం రిస్క్ డిటెక్టర్

ఊబకాయం ప్రమాదాన్ని గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ప్రిడిక్షన్ మోడల్ ను హైదరాబాద్ కు చెందిన వోక్సెన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు యుఎస్ శాస్త్రవేత్తతో కలిసి అభివృద్ధి Read more

కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి
srsimha raga

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఎన్నో సినిమాలకు పెళ్లి సంగీతాలు అందించిన కీరవాణి ఇప్పుడు తన కుమారుడి పెళ్లి భాజాలు మోగించించేందుకు సిద్దమయ్యాడు. Read more

పోసానికి పోలీస్ కస్టడీ..రేపు, ఎల్లుండి విచారణ
పోసానికి పోలీస్ కస్టడీ..రేపు, ఎల్లుండి విచారణ

పోసానికి పోలీస్ కస్టడీ..రేపు, ఎల్లుండి విచారణ టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళికి కేసుల చిక్కులు ఇప్పట్లో తీరేలా లేవు.ఒక కేసులో బెయిల్ రావడంతో ఊపిరిపీల్చుకునేలోపే, మరో కేసులో Read more