Mlc kavitha comments on cm revanth reddy

ఎన్నికల ముందు ఓ మాట.. ఎన్నికలలో గెలిచాక ఓ మాట: కవిత

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని కవిత ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించి.. ఇప్పుడు రైతులను అప్పు చెల్లించాలంటూ వేధించడం, రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నికలలో గెలిచాక మరో మాట.. ఇదీ రేవంత్ రెడ్డి గారి రెండు నాల్కల ధోరణి అంటూ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.

” ఎన్నికల ముందు ఓ మాట.. ఎన్నికలలో గెలిచాక మరో మాట.. ఇదీ రేవంత్ రెడ్డి గారి రెండు నాల్కల ధోరణి. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లిలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

రుణాలు మాఫీ చేసి అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, డబ్బులు కట్టాలంటూ అంకోల్ తండాలో రైతులపై ఒత్తిడి తీసుకురావడం, బలవంతంగా భూముల వేలానికి ప్రయత్నించడం నియంతృత్వ పాలనను తలపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించి.. ఇప్పుడు రైతులను అప్పు చెల్లించాలంటూ వేధించడం , రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనం.” అంటూ ట్వీట్‌ చేశారు.

Related Posts
సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం
Sukhbir Singh Badal shot in

శిరోమణి అకాలీదళ్ చీఫ్, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై బుధవారం హత్యాయత్నం చోటుచేసుకుంది. ఈ ఘటన అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల జరిగింది. Read more

Chandrababu : వివాదాస్పదంగా మారిన త్రిభాషా విధానం
Chandrababu వివాదాస్పదంగా మారిన త్రిభాషా విధానం

Chandrababu : వివాదాస్పదంగా మారిన త్రిభాషా విధానం నేడు అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన లఘు చర్చలో ‘స్వర్ణాంధ్ర విజన్-2047’ప్రణాళిక కింద రూపొందించిన నియోజకవర్గాల-2047 విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి Read more

ట్రంప్ ప్రమాణ స్వీకారానికి జయశంకర్
Jayashankar for Trump inauguration

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ ఈరోజు స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని అనేక దేశాల నేతలు హాజరు కానున్నారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న Read more

ప్రారంభం కానున్నబడ్జెట్.. ఆశాజనకంగా ఇన్వెస్టర్లు
nirmala

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు తన బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న వారి భవిష్యత్తుకు బడ్జెట్ ఎలాంటి మార్గం వేస్తుందనే Read more