MLC candidates meet PCC chief

పీసీసీ చీఫ్‌ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్ తోపాటు సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థి నెల్లికంటి సత్యం మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరు చీఫ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అధిష్టానం తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటామని, పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.

Advertisements
పీసీసీ చీఫ్‌ను కలిసిన ఎమ్మెల్సీ

ఓటింగ్‌కు మరో వారం రోజులు

ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం వీరంతా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఓటింగ్ కు మరో వారం రోజుల వరకూ ఉండటంతో.. ఎన్నికల వ్యూహంపై చర్చించినట్టు తెలుస్తోంది. కాగా అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల సంఖ్యను బట్టి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 4 స్థానాలు దక్కగా.. వాటిలో తన మిత్రపక్షం సీపీఐకి ఒక స్థానాన్ని కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణలో మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 20న ఎన్నిక జరగనుండగా.. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.

Related Posts
Terror Attack : పాక్‌పై భారత్ ప్రతీకారం.. సింధూ జలాల ఒప్పందం రద్దు.. అటారీ-వాఘ సరిహద్దును మూసివేత
India revenge on Pakistan.. Indus Water Treaty cancelled.. Attari Wagah border closed

Terror Attack : జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, భారతదేశం పాకిస్థాన్‌పై కఠిన చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు, 1960లో పాకిస్థాన్‌తో చేసుకున్న Read more

అల్లు అర్జున్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
revanth reddy

సినీ పెద్దలతో సమావేశంలో రేవంత్ అల్లు అర్జున్ వ్యవహారం పై కీలక వ్యాఖ్యలు చేసారు. తమకు ఎవరిపైన కక్ష సాధింపులు లేవని అన్నారు. ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం Read more

చంద్రబాబు అవగాహనారాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం – అంబటి
ambati polavaram

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవ్వడానికి చంద్రబాబు నాయుడి అవగాహనారాహిత్యమే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని వృథా చేస్తూ తీసుకున్న Read more

నవంబర్ 26న పార్లమెంట్ ఉభయసభల ప్రత్యేక సమావేశం
A special meeting of both houses of Parliament on November 26

న్యూఢిల్లీ: నవంబర్‌ 26న పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక సమావేశానికి సిద్ధమవుతున్నాయి. రాజ్యాంగానికి ఆమోదం ఇచ్చిన సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో నవంబర్ 26న ఈ Read more

Advertisements
×