mla kolikipudi srinivasa ra 1

రైతులపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఇటీవల ఆయన దీక్ష చేపట్టారు. ఆ సమయంలో ‘ఎన్నికల ఫలితాలకు ముందే రూ.లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడిక తీయించా. అదంతా రైతుల కోసమే కదా? కానీ ఈ రోజు నాకు అండగా ఏ రైతు అయినా వచ్చారా? కుక్కలకు విశ్వాసం ఉంటుంది, కొందరికి ఉండదు’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు దూషించడంతో చిట్యాల సర్పంచ్‌ తుమ్మలపల్లి శ్రీనివాసరావు సతీమణి ఆత్మహత్యకు యత్నించడం ఇటీవల దుమారం రేపింది. దీంతో ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తిరువూరు టీడీపీ నేతలు ధర్నాలు చేశారు. అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే కొలికిపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే లక్షల రూపాయలు పెట్టి పంట కాలువల్లో పూడిక తీయించానని కొలికిపూడి గుర్తు చేశారు. అదంతా రైతుల కోసమే చేశానని చెప్పారు. అయినప్పటికీ ఈ రోజు తనకు అండగా ఏ ఒక్క రైతు రాలేదని ప్రశ్నించారు. కుక్కలకు విశ్వాసం ఉంటుంది.. కానీ కొందరికి ఉండదని వ్యాఖ్యానించారు. ఇదే మాటను ఒకటికి రెండు సార్లు కొలికిపూడి నొక్కి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Related Posts
Minister Narayana: అమరావతి నిర్మాణానికి రూ.31,600 కోట్లు : మంత్రి నారాయణ
Rs. 31,600 crore for the construction of Amaravati.. Minister Narayana

Minister Narayana: శాసనమండలిలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ..రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.31,600 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. ఖర్చు పెట్టే నిధులన్నింటినీ Read more

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరికి బెయిల్
Two more bailed in phone tapping case

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావు, రాధాకిషన్‌రావుకు హైకోర్టు బెయిల్‌ Read more

బరాక్ ఒబామా, మిషెల్ విడాకులు..?
Barack Obama, Michelle divorce..?

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మిచెల్‌ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అయితే బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా త్వరలో విడాకులు Read more

నిలిచిపోయిన టీడీపీ అధికారిక యూట్యూబ్ ఛానల్
TDP Youtubechannel

టీడీపీ అధికారిక యూట్యూబ్ ఛానల్ సేవలు అనూహ్యంగా నిలిచిపోయాయి. ఇది టీడీపీ కార్యకర్తలు, పార్టీ వర్గాల్లో ఆందోళనకు గురిచేసింది. ఉదయం నుంచి ఛానల్ పూర్తి స్థాయిలో పనిచేయకుండా, Read more