mla kolikipudi srinivasa ra 1

రైతులపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఇటీవల ఆయన దీక్ష చేపట్టారు. ఆ సమయంలో ‘ఎన్నికల ఫలితాలకు ముందే రూ.లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడిక తీయించా. అదంతా రైతుల కోసమే కదా? కానీ ఈ రోజు నాకు అండగా ఏ రైతు అయినా వచ్చారా? కుక్కలకు విశ్వాసం ఉంటుంది, కొందరికి ఉండదు’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

Advertisements

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు దూషించడంతో చిట్యాల సర్పంచ్‌ తుమ్మలపల్లి శ్రీనివాసరావు సతీమణి ఆత్మహత్యకు యత్నించడం ఇటీవల దుమారం రేపింది. దీంతో ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తిరువూరు టీడీపీ నేతలు ధర్నాలు చేశారు. అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే కొలికిపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే లక్షల రూపాయలు పెట్టి పంట కాలువల్లో పూడిక తీయించానని కొలికిపూడి గుర్తు చేశారు. అదంతా రైతుల కోసమే చేశానని చెప్పారు. అయినప్పటికీ ఈ రోజు తనకు అండగా ఏ ఒక్క రైతు రాలేదని ప్రశ్నించారు. కుక్కలకు విశ్వాసం ఉంటుంది.. కానీ కొందరికి ఉండదని వ్యాఖ్యానించారు. ఇదే మాటను ఒకటికి రెండు సార్లు కొలికిపూడి నొక్కి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Related Posts
Sunita Williams : రూ.1.06 కోట్లు అందుకోనున్న సునీతా
Sunita Williams రూ.1.06 కోట్లు అందుకోనున్న సునీతా

Sunita Williams : రూ.1.06 కోట్లు అందుకోనున్న సునీతా నాసా ప్రముఖ వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో తొమ్మిది Read more

Chandrababu: సొంత నేతలపై చంద్రబాబు ఆగ్రహం
Chandrababu: సొంత నేతలపై చంద్రబాబు ఆగ్రహం

నామినేటెడ్ పదవుల భర్తీపై టెలీకాన్ఫరెన్స్ ఏపీ సీఎం చంద్రబాబు నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి Read more

నేడు జాతీయ ఫార్మసిస్ట్ దినోత్సవం
నేడు జాతీయ ఫార్మసిస్ట్ దినోత్సవం

జనవరి 12న ప్రతి ఏడాది జాతీయ ఫార్మసిస్ట్ దినోత్సవం (National Pharmacist Day) జరుపుకుంటారు. ఈ ప్రత్యేక దినం ఫార్మసిస్ట్‌లను గౌరవించడానికి, వారి సేవలకు అభినందనలు తెలపడానికి Read more

భోగి వేడుకల్లో కేటీఆర్‌, హరీశ్‌ రావు
KTR and Harish Rao in Bhogi celebrations

హైదరాబాద్‌: భోగి వేడుకల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి సోమవారం తన నివాసంలో Read more