IPL 2025: వ్యక్తిగత కారణాలతో మిచెల్ మార్ష్ మ్యాచ్ ఆడటం లేదు:రిషభ్ పంత్

IPL 2025: వ్యక్తిగత కారణాలతో మిచెల్ మార్ష్ మ్యాచ్ ఆడటం లేదు:రిషభ్ పంత్

ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. వ్యక్తిగత కారణాలతో మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్ ఆడటం లేదని చెప్పాడు. అతని కూతురు అనారోగ్యానికి గురవ్వడంతో మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని పేర్కొన్నాడు.

Advertisements

అద్భుత ప్రదర్శన

మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. చూడటానికి పిచ్ బాగుంది. గత రెండు మ్యాచ్‌లు గెలవడం సంతోషంగా ఉంది. ఓ జట్టుగా మా ప్రక్రియపైనే ఫోకస్ పెట్టాం. ప్రతీ ఆటగాడు అద్భుతంగా ఆడుతున్నాడు. బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. మా విజయాల క్రెడిట్ వారిదే. ఈ మ్యాచ్‌కు మిచెల్ మార్ష్ దూరమయ్యాడు. అతని స్థానంలో హిమ్మత్ సింగ్ జట్టులోకి వచ్చాడు. మిచెల్ మార్ష్ కూతురు అనారోగ్యానికి గురైంది.’అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.ఈ సీజన్‌లో మిచెల్ మార్ష్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన 6 మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే అతను డకౌటయ్యాడు. ఈ సీజన్‌లో మిచెల్ మార్ష్ వరుసగా 72, 52, 0, 60, 81 పరుగులు చేశాడు. అతని గైర్హాజరీ లక్నో‌ సూపర్ జెయింట్స్‌కు నష్టం చేసే అవకాశం ఉంది.

బౌలింగ్ ఎంచుకోవాలనే

టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ‘నేను బౌలింగ్ ఎంచుకోవాలనే అనుకున్నాను. వికెట్‌లో మార్పు ఉంటుందని నేను అనుకోవడం లేదు. ప్రతీ ఒక్కరు రాణిస్తున్నారు. అది మాకు కీలకం. కుల్వంత్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చాడు.’అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

గుజరాత్ టైటాన్స్ 

సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్

లక్నో సూపర్ జెయింట్స్

ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.

Read Also: Vishnu Vishal: సిఎస్ కె ఆటతీరుపై స్పందించిన హీరో విష్ణు విశాల్

Related Posts
AP Govt : ఉగాది వేడుకలకు రూ.5 కోట్లు విడుదల
AP govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రూ.5 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ ఉత్సాహంగా జరగేలా చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. Read more

ఎల్ కె అద్వానీకి అస్వస్థత
LK Advani Indian politician BJP leader India 2015

భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్ కె అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం ఉదయం అద్వానీని ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి Read more

ఏపీలో నేడే మద్యం షాపుల కోసం లాటరీ
Liquor shops lottery today in AP

అమరావతి: ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా Read more

దావోస్ నుంచి తిరిగొచ్చిన లోకేష్
Nara Lokesh returned from Davos

అమరావతి: ఐదు రోజుల దావోస్ పర్యటన ముగించుకున్న ఏపీ విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ స్వదేశానికి తిరిగొచ్చారు. శనివారం తెల్లవారుజామున 1.35 గంటలకు గన్నవరం Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×