Liquor shops lottery today in AP

ఏపీలో నేడే మద్యం షాపుల కోసం లాటరీ

అమరావతి: ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా, 89,882 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1797.64కోట్ల ఆదాయం వచ్చింది.

అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రావడంతో వాటిని పునః పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 మద్యం దుకాణాలకు అత్యధికంగా 5,764 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా, ఏపీలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు లాటరీ పధ్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నారు. దీంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 15న (రేపు) ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించనున్నారు. దీంతో 16వ తేదీ నుండి రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వస్తుంది.

Related Posts
స్విట్జర్లాండ్‌లో “బుర్కా బాన్” చట్టం: 2025 జనవరి 1 నుండి అమలు
burka

స్విట్జర్లాండ్ లో "బుర్కా బాన్" చట్టం 2025 జనవరి 1 నుండి అమలులోకి రానుంది. ఇది ప్రజల ముందు ముఖం కప్పుకున్న వస్త్రాలు ధరిస్తున్న వారికి జరిమానా Read more

సదరన్ ట్రావెల్స్ “హాలిడే మార్ట్”
Southern Travels "Holiday Mart"

హైదరాబాద్‌: సదరన్ ట్రావెల్స్, 45 లక్షల మందికి పైగా సంతోషకరమైన ప్రయాణీకులకు మరపురాని ప్రయాణ అనుభవాలను అందించడంలో 55 సంవత్సరాల వారసత్వంతో ప్రయాణ మరియు పర్యాటక పరిశ్రమలో Read more

71 వేల మందికి నేడు ప్రధాని నియామక పత్రాలు
PM Modi appointment papers for 71 thousand people today

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సోమవారం నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ చేతులు Read more

సీగ్రమ్స్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మ్యూజికల్ ఉత్సవం..
Seagram Royal Stag Boom Box Musical Festival

‘లివింగ్ ఇట్ లార్జ్’ స్ఫూర్తికి చిహ్నంగా హైదరాబాద్‌లో బోల్డర్ హిల్స్ లో జనవరి 25న మ్యూజిక్ మరియు యువ సంస్కృతి యొక్క వైభవోపేతమైన సంబరం. రాయల్ స్టాగ్ Read more