ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు

Chandrababu Naidu: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు: చంద్రబాబు

ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈసారి ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉదయం 11 గంటలకు ప్రకటించారు. ఫస్టియర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 70గా నమోదవగా, సెకండియర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 83గా నమోదైంది. ఈ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది.

Advertisements

ఈసారి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులందరికీ హార్దిక శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. ఫస్టియర్ లో 47% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు,సెకండియర్ లో 69% విద్యార్థులు విజయం సాధించారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే: ఫస్టియర్ లో 11 శాతం పెరుగుదల,సెకండియర్ లో 9 శాతం పెరుగుదల, ఈ గణాంకాలు ప్రభుత్వ విద్యా రంగంలో సంభవించిన నాణ్యతా మార్పులకు ప్రతిబింబం అనే చెప్పాలి.

చంద్రబాబు స్పందన

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా స్పందిస్తూ, ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కొత్త శకానికి నాంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు ఈ స్థాయిలో ఫలితాలు సాధించటం గర్వించదగ్గ విషయం, అని అన్నారు. అంతేకాక, ఇది తాము చేపట్టిన విద్యా సంస్కరణల ఫలితం అని స్పష్టం చేశారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌ల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, కేంద్రీకృత మూల్యాంకనం, పర్యవేక్షణ, నూతన సమయపాలన, 100 రోజుల సక్సెస్ కార్యక్రమం, తరగతుల వారీగా వాట్సాప్ గ్రూపులు, సంరక్షకుల వ్యవస్థ ఇలా విద్యా రంగంలో మేము ప్రవేశపెట్టిన సంస్కరణలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడ్డాయి అని చంద్రబాబు వివరించారు. 

Read also: B R Naidu: గోశాలలో ఆవుల మృతిపై స్పందించిన టీటీడీ ఛైర్మన్

Related Posts
Donald Trump: మళ్ళీ దేశాలకు ట్రంప్ వార్నింగ్..ఈ సారి ఏ విషయంలో అంటే!
మళ్ళీ దేశాలకు ట్రంప్ వార్నింగ్..ఈ సారి ఏ విషయంలో అంటే!

వెనెజులా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశం నుంచి చమురు కానీ, గ్యాస్ Read more

ముంబయి 26/11 మారణ హోమానికి 16 ఏళ్లు..
16 years

మంబయి: దేశ ఆర్థిక రాజధానిలో మారణ హోమానికి 16 ఏళ్లు. 2008 నవంబర్ 26న సముద్రమార్గం ద్వారా మంబయిలోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదులు తాజ్ హోటల్, Read more

ఏపీలో రేషన్​కార్డుదారులకు గుడ్​న్యూస్​ ..
ap ration shop

ఏపీలో రేషన్​కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్ లో నిత్యావసర ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రేషన్​ దుకాణాల్లో నేటి (అక్టోబర్​ Read more

Viveka : వివేకా హత్య కేసు నిందితులకు త్వరలో సినిమా – ఆదినారాయణ రెడ్డి
adhi narayana

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×