Erthquake : ఆసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి భూ ప్రకంపనాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా సోమవారం మధ్యాహ్నం భారత్ లో స్వల్ప భూకంపం సంభవించింది. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లొని షియోమీలో ఈ భూకంపం నమోదైనట్టు ఇండియన్ సిస్మోలాజికల్ సెంటర్ అధికారులు పేర్కొన్నారు. రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 3.5 గా నమోదు అయింది. కాగా భూప్రకంపనలకు జనం భయంతో బయటికి పరుగులు తీశారు. కాగా ఈ ఘటనలో ఆస్తినష్టం, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.

ఆరోజు నుంచి పలు ఆసియా దేశాలు వరుసగా భూకంపాలు
కాగా, ఇటీవలే మయన్మార్, థాయ్ లాండ్‌తో సహ, భారత్, చైనా వంటి దేశాల్లో భూకంపం సంభవించగా.. మయన్మార్, థాయ్ లాండ్‌లో దాదాపు 1600 పైగా ప్రజలు మృతి చెందగా వేలాది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఆరోజు నుంచి పలు ఆసియా దేశాలు వరుసగా భూకంపాలతో వణికిపోతున్నాయి. అయితే ఇవేవీ మయన్మార్ భూకంపం అంత తీవ్రంగా లేకపోయినా ప్రజలు భయం గుప్పిట్లోనే బ్రతుకుతున్నారు. మయన్మార్, థాయ్ లాండ్ దేశాలకు ప్రపంచ దేశాలు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.