ponguleti indiramma

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన లబ్ధిదారులకు ఇది అందించాలనే ప్రభుత్వ విధానమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రెవెన్యూ వ్యవస్థ, సర్వేయర్ల నియామకంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో ఇండ్లకు అర్హులైన లబ్ధిదారుల నివాస స్థల పరిస్థితుల ప్రకారం రెండు జాబితాలను గ్రామసభల్లో ఉంచాలని మంత్రి అధికారులకు సూచించారు. దశల వారీగా ఇండ్ల నిర్మాణం చేపట్టి, ప్రతి అర్హుడికి ఇండ్లు అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉన్న 274 ఇంజనీర్లు అన్ని పరిశీలిస్తున్నప్పటికీ, అదనంగా 400 మంది ఇంజనీర్లు అవసరమని అధికారులు తెలిపారు. ఇతర ప్రభుత్వ విభాగాల ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా ఉపయోగించే అవకాశాలపై చర్చ జరిగిందని , ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని, ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమించేందుకు వీఆర్వో, వీఆర్‌ఏల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి పరీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి విధివిధానాలను త్వరగా రూపొందించి, పారదర్శకతతో నియామక ప్రక్రియ చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం ఉన్న 450 మంది సర్వేయర్లకు అదనంగా 1000 మంది అవసరమని పేర్కొంటూ, ఈ నియామకాలు నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Related Posts
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్: భారతదేశాన్ని నిర్వచించిన శకంపై మంత్రముగ్ధులను చేసే కథనం..
Freedom at Midnight

హైదరాబాద్‌: ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ అనేది 1944 -1947 మధ్య కాలంలోని గందరగోళ సంవత్సరాలను ఎంతో లోతుగా, సున్నితత్వంతో విశ్లేషిస్తుంది. భారతదేశ స్వాతంత్ర్య ప్రయాణం యొక్క గ్రిప్పింగ్ Read more

గాజాలో ఆసుపత్రిపై ఇజ్రాయిల్ కాల్పులు : ఆసుపత్రి లో మందులు లేని పరిస్థితి
hospital attack

గాజాలోని కమాల్ అద్వాన్ ఆసుపత్రి డైరెక్టర్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం, ఆసుపత్రికి 17 పోషకాహార లోపం ఉన్న పిల్లలు చేరుకున్నారు. అయితే, ఈ పిల్లల చికిత్సకు Read more

నేడు “విజయ్‌ దివస్‌”.. అమర జవాన్లకు నివాళులు
Today is "Vijay Divas".. tributes to the immortal jawans

న్యూఢిల్లీ: నేడు విజయ్‌ దివస్‌. దేశ చరిత్రలో మర్చిపోలేని రోజు. 1971 యుద్ధంలో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది. సరిగ్గా 53 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌ Read more

Amaravati : తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం
Amaravati తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం

Amaravati : తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తిరుమలను తలపించేలా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. Read more