తెలంగాణ (Telangana) మంత్రివర్గంలో నూతనంగా చేరిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపు కోసం కాంగ్రెస్ అధిష్టానం జోరుగా కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో, ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులూ చేపట్టాలని వ్యూహం సిద్ధమవుతోంది.సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉండి పార్టీ కీలక నేతలతో సమావేశమవుతున్నారు. సోమవారం కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన ఆయన, మంగళవారం రాహుల్ గాంధీ, ఖర్గేతో రెండున్నర గంటలపాటు చర్చలు జరిపారు.ప్రస్తుత మంత్రుల వద్ద ఉన్న శాఖల పనితీరు, వారి సామర్థ్యంపై రేవంత్ నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్థిక, నీటిపారుదల, రెవెన్యూ వంటి కీలక శాఖల పనితీరు ఈ సమీక్షలో ముఖ్యంగా చర్చకు వచ్చింది.రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ ఇప్పటికే మంత్రుల పనితీరు గురించి అధిష్టానానికి నివేదిక అందించినట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోల్పోయిన నేతల విషయమై కూడా రేవంత్, అధిష్టానం మధ్య చర్చ జరిగింది.
మంత్రి ఉత్తమ్ హస్తినకు.. మంత్రివర్గ మార్పులకు సంకేతమా?
సీఎం రేవంత్ ఢిల్లీలో ఉండగా, మంగళవారం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. దీంతో మంత్రి శాఖల మార్పులపై అంతర్గత చర్చ తీవ్రంగా సాగుతోందని ప్రచారం బలపడుతోంది.ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణనపై రెండు బహిరంగ సభలపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ సభలకు రాహుల్, ఖర్గే హాజరయ్యేలా చేయాలని రేవంత్ కోరగా, వారు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
సీఎంగా రేవంత్‌కి మరో కీలక సూచన
రాహుల్ గాంధీ, నరేంద్రమోదీ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్‌కు సూచించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. టీపీసీసీ పనితీరు, విస్తరణ తదితర అంశాలపై కూడా చర్చలు సాగినట్టు తెలుస్తోంది.మరోవైపు నూతన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ.. శాఖల కేటాయింపు సీఎం రేవంత్ చేతుల్లోనే ఉందని, త్వరలోనే ప్రక్రియ పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also : India Fertility Rate 2025 : దేశంలో తగ్గిపోతున్న జననాల రేటు: భవిష్యత్‌కు కొత్త సవాల్