Rahul Gandhi Warangal visit cancelled

రాహుల్ గాంధీపై మాట్లాడే హక్కు బీజేపీకి లేదని మంత్రి శ్రీధర్ బాబు

  • కులం, మతం చూడకుండా ప్రజలను ఐక్యంగా చూడటమే కాంగ్రెస్ విధానం

తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “రాహుల్ గాంధీ ఏ కులం? ఏ మతం?” అంటూ ప్రశ్నించిన బీజేపీ నేతలకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. కులం, మతం చూడకుండా ప్రజలను ఐక్యంగా చూడటమే కాంగ్రెస్ విధానం అని మంత్రి స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు.

We will create more jobs in IT.. Minister Sridhar Babu

బీజేపీ బీసీ వర్గాలను మోసం చేస్తోందని శ్రీధర్ బాబు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టకుండా బీజేపీ బీసీలకు అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు. హిందువుల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా బీజేపీకి లేదని ఆయన అన్నారు.

ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులం గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు రాహుల్ గాంధీ కులం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా శ్రీధర్ బాబు పైవిధంగా స్పందించారు. రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని, అతని నాయకత్వాన్ని కులంతో అంచనా వేయడం అప్రాసంగికం అని ఆయన అన్నారు.

Related Posts
రైతుభరోసా పరిమితి, మార్గదర్శకాలు
formers

రైతులకు తమ ప్రభుత్వం మేలుచేస్తున్నదని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఆ దిశగా చర్చలను కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా రైతు భరోసా అర్హత .. పరిమితి పైన Read more

‘ది టీచర్ యాప్’ను ఆవిష్కరిస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Union Education Minister Dharmendra Pradhan unveiling The Teacher App

వివిధ రకాల ఉపాధ్యాయ అభ్యసన స్టైల్స్ కు మద్దతు ఇవ్వడానికి ది టీచర్ యాప్ ఉచిత, మంచి-క్వాలిటీ కలిగిన, ఇంటరాక్టివ్ డిజిటల్ వనరులను అందిస్తుంది. సృజనాత్మక మరియు Read more

రంగరాజన్‌ను పరామర్శించిన యాంకర్ శ్యామల
anchor shyamala rangarajan

రంగరాజన్‌ పై జరిగిన దాడిని ఖండించిన శ్యామల వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల నేడు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను కలిసి పరామర్శించారు. Read more

దిల్ రాజు ఇంట్లో మళ్లీ ఐటీ సోదాలు..ఎవరి ఆధ్వర్యంలో అంటే..!!
IT rides dilraju

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో మరోసారి ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సారి ఓ మహిళా అధికారి ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతుండటం Read more