Minister Seethakka participated in the mini Medaram jatara celebration

వన దేవతలను దర్శించుకున్న సీతక్క

ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర

వరంగల్‌: తాడ్వాయి మండలంలోని మేడారంలో మొదలైన ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ మేడారం వన దేవతలను రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించిన సీతక్క. అనంతరం మాట్లాడుతూ.. ఈ రోజు నుండి నాలుగు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే జాతర పరిసరాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

image

మేడారంలో నిరంతర నాణ్యమైన వైద్య సేవలు వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ, అని వైద్య శాఖ సిబ్బంది అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర సమయాలలో ఇబ్బందులకు గురయ్యే వారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరగకుండా చోరీ సంఘటన జరగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జంపన్న వాగు, గద్దెల ప్రాంతం, మేడారం పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులచే నిరంతరం శుభ్రంచేయించాలని తెలిపారు. భారీ సంఖ్యలో వాహనాలు వచ్చిన పక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలలో వాహనాలు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని, నిరంతరం పోలీస్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు.

image

ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సందర్భంగా గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిర్లను ఏర్పాట్లు చేశామని, దాదాపు 5 కోట్ల 30 లక్షల రూపాయలతో వివిధ పనులను పూర్తి చేయడం జరిగిందని వివరించారు. జాతరను పురస్కరించుకొని పలుచోట్ల ప్రత్యేకంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశామని, త్రాగునీటి కొరత ఏర్పడకుండా నిరంతరం నీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే జాతరను పురస్కరించుకొని ఆర్టీసీ అధికారులు హనుమకొండ జిల్లా కేంద్రం నుండి నిరంతరం బస్సులను మేడారం నడిపించనున్నారని, జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. వనదేవతలను దర్శించుకుని సురక్షితంగా ఎవరి ఇండ్లకు వారు వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ అత్రం సుగుణ , కాంగ్రెస్ పార్టీ ములుగుబ్ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts
కులగణన సర్వే : బీసీల్లో ముదిరాజ్లు టాప్, ఆ తర్వాత యాదవులు
kulaganana yadavus

తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వేలో బీసీ జనాభా గణనీయంగా ఉన్నట్లు తేలింది. మొత్తం రాష్ట్ర జనాభాలో బీసీల సంఖ్య 1.60 కోట్లకు పైగా ఉందని నివేదిక వెల్లడించింది. Read more

జగన్ గుంటూరు పర్యటనకు అనుమతి నిరాకరణ
Denial of permission for Jagan visit to Guntur

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు జగన్ పర్యటనకు అనుమతి నిరాకరణ అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైస్ జగన్ ఈరోజు గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరు మిర్చి Read more

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల
JEE Main Results Released

సత్తాచాటిన తెలుగు విద్యార్థులు.. న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న జేఈఈ (మెయిన్) ఫలితాలు ఫిబ్రవరి 11న విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలో Read more

చట్టం లేకుండా బీసీలకు రిజర్వేషన్లు పెరగవు : శ్రీనివాస్‌ గౌడ్‌
No increase in reservation for BCs without legislation. Srinivas Goud

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడూతూ..బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం Read more