పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
చిట్యాల (నల్గొండ) : రాష్ట్ర ప్రభుత్వం,కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా పనిచేస్తుందని, వారి ఆర్థిక స్వాలంబన సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రామీణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయ ఆవరణలో గ్రామీణ అభివృద్ధి శాఖ. సేర్ప్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (Gandra Satyanarayana Rao) అధ్యక్షతన ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ, ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం సంఘాలకు వడ్డీ లేని రుణా లను అందించి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి కృత నిశ్చ యంతో పని చేస్తుందని స్పష్టం చేశారు.
మహిళ సంఘాలలో
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు అనేక వ్యాపార, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారం భించిందని పేర్కొన్నారు. మహిళలు తమ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవాలని, నూతన ఓ రవడులతో కొత్త వ్యాపారాలను ఎన్నుకోవాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నట్లు చెప్పారు. ప్రతి మహిళ సంఘాలలో చేరాలని సూచించారు. పదహారేళ్ల నుండి 60 ఏళ్ల వృద్ధురాలు వరకు సంఘంలో చేరే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని పునరుద్ధరించారు. ఇందిరాగాంధీ మహిళా శక్తి (Women power) చాటి పాకిస్తాన్ ను గడగడలాడించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు.ఇందిరా గాంధీ ఉక్కు మహిళగా గుర్తించబడిందని తెలిపారు. పేదరిక నిర్మూలన అంటే మహిళలు ఆర్థికంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిలో,శిల్పారామంలో 300 కోట్లతో నిర్మించిన స్టాల్లో మహిళలు తయారు చేసిన వస్తువులను విక్రయించేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

వ్యాపార సదుపాయాలుగా
ఇందిరమ్మ గృహ నిర్మాణాల కోసం ముందస్తుగా పెట్టుబడి సహాయం చేసి మహిళలను ఓనర్లుగా చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. సంఘంలోని మహిళలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు సాధారణ మరణానికి రూ 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షల ఎక్స్రేషియా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. మహిళలకు మహిళా శక్తి క్యాంటీన్లు, గోడం, మిల్లులు, పెట్రోల్ బంకులు (Petrol stations), పౌల్ట్రీ ఫార్మ్స్, సోలార్ విద్యుత్తు, ఆర్టీసీ బస్సులను వ్యాపార సదుపాయాలుగా అందించడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే సంఘాలకు 26 వేల కోట్ల రుణాలను ఇచ్చామని, రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వాన్ని స్పష్టం చేశారు. 18 నెలల కాలంలో మహిళల ఆర్ధిక అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
సీతక్క (Dansari Anasuya) ఏ పార్టీకి చెందారు?
సీతక్క భారత జాతీయ కాంగ్రెస్ (Indian National Congress – INC) పార్టీకి చెందినవారు. ఆమె తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌లో కీలక నాయకురాలిగా ఉన్నారు.
సీతక్క ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు?
సీతక్క తెలంగాణ రాష్ట్రంలోని ములుగు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇది గిరిజనులకు రిజర్వ్ చేసిన నియోజకవర్గం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: TG EAPCET: ఎప్ సెట్లో 77,561 సీట్లు భర్తీ5493 సీట్లు ఖాళీ