గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం సంకల్పబద్ధంగా పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. ప్రత్యేకంగా చెంచు తెగలకు మద్దతుగా 10,000 ఇందిరమ్మ ఇళ్లను(Indiramma’s houses) మంజూరు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఇది ITDA పరిధిలో ఉన్న గిరిజనులకు ఒక శుభవార్తగా మారింది. చెంచుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించామన్నారు.
(ITDA) ప్రాంతాల్లో ఇళ్ల మంజూరు
ఉట్నూరు, భద్రాచలం, మన్ననూర్, ఏటూరు నాగారం వంటి గిరిజన అభివృద్ధి ఏజెన్సీ (ITDA) ప్రాంతాల్లో ఈ ఇళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతి నియోజకవర్గానికి అదనంగా 500 నుంచి 700 ఇళ్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. గిరిజనుల వాస్తవ అవసరాలను గుర్తించి, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేపట్టడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టంచేశారు.
చెంచు గిరిజనులకు ప్రత్యేక ఇళ్లులు
చెంచు గిరిజనులు రాష్ట్రంలో అత్యంత వెనుకబడి ఉన్న తెగలుగా పేర్కొంటూ, వారికి విద్య, ఆరోగ్యం, భద్రతతోపాటు నివాస హక్కు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో చెంచు కుటుంబాలు స్థిర నివాసాన్ని పొందగలవని, దీని ద్వారా వారి జీవనవిధానం, సామాజిక స్థితి మెరుగవుతుందని మంత్రి పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also : Chandrababu : ఈనెల 25న కుప్పంలో చంద్రబాబు పర్యటన