ఆంధ్రప్రదేశ్ (AP Metro Rail ) పట్టణ అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు కీలక దశలోకి అడుగుపెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కేటాయింపును మంత్రివర్గంలో ఆమోదించింది. దీంతో మెట్రో పనుల వేగం పెరిగింది.మంత్రి నారాయణ మాట్లాడుతూ, విశాఖపట్నం మరియు విజయవాడలో మొదటి దశ పనులు మూడు సంవత్సరాల్లో పూర్తవుతాయని స్పష్టం చేశారు. ఈ లక్ష్యంతో అన్ని విభాగాలు సమన్వయంగా పని చేస్తున్నాయని తెలిపారు.శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, సిస్టా, టిప్సా కన్సల్టెన్సీలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ (Minister Narayana) హాజరయ్యారు.

విశాఖ మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 వివరాలు
మంత్రి నారాయణ ప్రకారం, ఫేజ్-1లో 46.23 కిలోమీటర్ల పనుల కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. అలాగే ఫేజ్-2లో మరిన్ని 30 కిలోమీటర్ల ప్రాజెక్టు ఉంటుందని తెలిపారు.విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు మరిన్ని రెండు రోజుల్లో టెండర్లు పిలుస్తామని మంత్రి ప్రకటించారు. ప్రాజెక్టు పర్యవేక్షణ మరియు సాంకేతిక సహకారం కోసం కన్సల్టెన్సీలతో చర్చలు పూర్తయ్యాయని చెప్పారు.
ప్రాజెక్టు పూర్తి తర్వాత లాభాలు
ఈ రెండు నగరాల్లో మెట్రో రైలు ప్రారంభమైతే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. అలాగే ప్రజల రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also : Telangana Government : తెలంగాణలో ప్రత్యేక అధికారుల నియామకం