విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేశ్‌

అమరావతి: తన పరువుకు భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించారంటూ సాక్షి దినపత్రికపై వేసిన పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు హాజరయ్యారు. సాక్షి పత్రికపై రూ. 75 కోట్లకు పరువునష్టం దావా వేసిన లోకేశ్ తరపు న్యాయవాదులు నేడు కోర్టులో వాదనలు వినిపించనున్నారు.

Advertisements

‘చినబాబు తిండికి 25 లక్షలండి’ పేరుతో 2019 అక్టోబర్ 22న సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో పేర్కొన్న అంశాలన్నీ పూర్తిగా అవాస్తవమని, తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు దురుద్దేశపూర్వకంగా తప్పుడు కథనం రాశారంటూ కథనం ప్రచురితమైన మూడో రోజున అంటే 25న సాక్షి సంపాదక బృందానికి లోకేశ్ న్యాయవాదులు నోటీసులు పంపారు. దీనిపై స్పందించిన సాక్షి అదే ఏడాది నవంబర్ 10న సమాధానం పంపింది.

దీనిపై సంతృప్తి చెందని లోకేశ్ ఆ సంస్థపై పరువునష్టం దావా వేశారు. విశాఖ విమానాశ్రయంలో తాను చిరుతిళ్లు తిన్నట్టు వార్తలో పేర్కొన్న తేదీల్లో తాను ఇతర ప్రాంతాల్లో ఉన్నానని, అయినప్పటికీ దురుద్దేశంతో తన పరువుకు భంగం కలిగించేలా రాజకీయ లబ్ధికోసం అసత్యాలతో కథనం ప్రచురించారని లోకేశ్ తన దావాలో పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన సాక్షి సంస్థ జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్, సాక్షి ప్రచురణ కర్త మురళి, విశాఖ సాక్షి న్యూస్ రిపోర్టర్లు వెంకటరెడ్డి, ఉమాకాంత్‌లపై రూ. 75 కోట్లకు పరువునష్టం దాఖలు చేశారు.

Related Posts
మహిళ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా
cbn pention

మహిళ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను Read more

బొమ్మరిల్లు ఫేమ్ సిద్ధార్థ్ కు అరుదైన వ్యాధి
siddarth2

టాలీవుడ్, కోలీవుడ్‌లో తనదైన శైలిలో నటనతో గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన గుర్తింపు వల్ల తనకు పోస్ట్-ట్రామాటిక్ Read more

సుంకాల తగ్గింపు చర్యలు నిజమే..కానీ ఒత్తిడితో కాదు : భారత్‌
Tariff reduction measures are real...but not under pressure

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల మాట్లాడుతూ..భారత్ అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తుందన్న అంశాన్ని తాను బహిరంగంగా లేవనెత్తడం వల్లే.. ఆ దేశం ఆందోళన చెంది Read more

పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ అమలు – నారా లోకేష్
పాఠశాలల్లో 'నో బ్యాగ్ డే' అమలు - నారా లోకేష్

పిల్లలు స్కూల్ బ్యాగులను తీసుకుని బడికి వెళ్లడం గురించి చర్చిస్తూ, వారికి ప్రతి శనివారం ఒక రోజు బ్రేక్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ Read more

×