HCL Lokesh

ఏపీలో HCLను విస్తరించాలని మంత్రి లోకేశ్ వినతి

ఆంధ్రప్రదేశ్‌లో HCL సంస్థను మరింత విస్తరించి మరో 10 వేల మందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. దావోస్ పర్యటనలో భాగంగా HCL సీఈవో కళ్యాణకుమార్‌తో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో ఉన్న పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానాలపై మంత్రి లోకేశ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఈ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. రీలొకేషన్ చేసే పరిశ్రమలు, ఎక్విప్మెంట్ ఇంపోర్టుకు 50 శాతం రాయితీలు కల్పించడంతో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

HCL ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇస్తోందని మంత్రి ప్రశంసించారు. అయితే ఇప్పుడున్న స్థాయిని మరింత విస్తరించడానికి అవసరమైన సహకారం ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఈ విస్తరణ ద్వారా యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. దావోస్ పర్యటన సందర్భంగా HCL వంటి సంస్థలతో జరిగిన చర్చలు రాష్ట్ర అభివృద్ధికి పునాది వేస్తాయని, మున్ముందు మరిన్ని సంస్థలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు.

Related Posts
వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోడీ
Prime Minister Modi to visit Amravati on 15th of next month

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ వచ్చే నెల 15వ తేదీన ఏపీలో పర్యటించనున్నారు. రాజధాని పునః ప్రారంభ పనులకు హాజరుకానున్నారు. ఏపీ రాజధానితో సహా రాష్ట్రంలో లక్ష కోట్ల Read more

పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్‌
israel released palestinian prisoners

జెరూసలేం : హమాస్ ఇజ్రాయెల్‌కు అప్పగించిన ముగ్గురు ఇజ్రాయెలీ బందీలకు బదులుగా దాదాపు 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా Read more

ఏపీపీఎస్సీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా అనురాధ బాధ్య‌త‌ల‌ స్వీక‌రణ‌
anuradha

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అనురాధ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్‌లో ఈ బాధ్యతలు Read more

డ్రోన్ షోను నిర్వహించిన గోద్రెజ్ ప్రాపర్టీస్
Godrej Properties organized the drone show

హైదరాబాద్‌ : భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకటైన గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్, హైదరాబాద్‌ నగరం యొక్క సాంస్కృతిక వైభవాన్ని మరియు వారసత్వాన్ని వేడుక జరుపుకునేందుకు Read more