తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్‌తో మంత్రి చర్చలు
అమరావతి: మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా లోకేశ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి తైవాన్ సహకారం కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి తీసుకొచ్చిన పాలసీలు, అనుమతుల దగ్గర నుండి ఉత్పత్తి ప్రారంభం వరకూ ప్రభుత్వం నుండి అందిస్తున్న సహకారం గురించి మంత్రి వివరించారు.

ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ తయారీ రంగాల్లో తైవాన్ అగ్రగామిగా ఉంది. సమావేశంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి తైవాన్ తీసుకొచ్చిన పాలసీలు, తీసుకున్న చర్యల గురించి నారా లోకేశ్ తైవాన్ ప్రతినిధుల బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ పద్దతిలో కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి పలు ఉదాహరణలతో వివరించారు.
2014-19 వరకూ తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి కల్పించిన మౌలిక సదుపాయాలు, అక్కడ ఏర్పాటైన అనేక కంపెనీలు తద్వారా వేలాదిగా యువతకు లభించిన ఉద్యోగ అవకాశాల గురించి తైవాన్ బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి. లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకే వీటిని ప్రాధాన్యత రంగాలుగా గుర్తించి పని చేస్తున్నామని నారా లోకేశ్ అన్నారు.