హరీష్ రావు పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై రాజకీయ వేడిని పెంచుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావును ప్రశ్నించారు. హరీశ్ రావు చేస్తున్న విమర్శలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును ఎందుకు పెండింగులో పెట్టిందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేగాక, ప్రాజెక్టు నిర్మాణాన్ని 200 మీటర్లు తవ్వి మిగతా పనులు ఎందుకు నిలిపివేశారనే అంశాన్ని హరీశ్ రావు స్పష్టంగా చెప్పాలని మంత్రి ప్రశ్నించారు.

ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్
హరీష్ రావు పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ వెళుతుందనే భయంతోనే బీఆర్ఎస్ గతంలో దీనిని వదిలేసిందా? అని ప్రశ్నించారు. తక్కువ వ్యయంతో పూర్తి చేయగలిగే ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తిగా అభివృద్ధి చేయలేకపోయారు? గత ప్రభుత్వం తక్కువ లాభం వస్తుందనే దీన్ని నిర్లక్ష్యంగా వదిలేసిందా? అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ప్రకృతి విపత్తులను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు దక్కించుకునే అవకాశం చాలా తక్కువ
ఈ ఘటనపై సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు దక్కించుకునే అవకాశం చాలా తక్కువగా ఉందని ఆయన విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, ప్రభుత్వం అన్ని మార్గాల్లో సహాయ చర్యలను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ఇటువంటి సమస్యలను రాజకీయ వాదనలకు వాడుకునే బదులు, ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాల్సిందని మంత్రి సూచించారు.