Migration of 75 Indians from Syria

సిరియా నుంచి 75 మంది భార‌తీయుల త‌రలింపు

న్యూఢిల్లీ: సిరియాలో నెలకొన్న పరిస్థితుల మధ్య అక్కడున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా 75 మంది భారత పౌరులను డమాస్కస్‌ నుంచి లెబనాన్‌కు సురక్షితంగా తీసుకొచ్చింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 75 మంది భారతీయుల్లో 44 మంది జమ్మూకశ్మీర్‌కు చెందిన జైరిన్‌ (యాత్రికులు)లు ఉన్నారని మంత్రిత్వశాఖ పేర్కొంది.

Advertisements

వారంతా సిరియా సరిహద్దులు దాటి క్షేమంగా లెబనాన్‌కు చేరుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్కడ నుంచి వారంతా వాణిజ్య విమానాల ద్వారా లెబనాన్‌ నుంచి త్వరలోనే స్వదేశానికి చేరుకోనున్నట్లు తెలిపింది. ఇంకా అనేక మంది భారతీయులు సిరియాలో ఉన్నారని వెల్లడించింది. వారంతా డమాస్కస్‌లోని రాయబార కార్యాలయంతో +963 993385973 వాట్సప్‌లో, hoc.damascus@mea.gov.in ఇ-మెయిల్‌ ద్వారా టచ్‌లో ఉండాలని పేర్కొంది.

కాగా, సాయుధ తిరుగుబాటుదారులు సిరియా రాజధాని డమాస్కస్‌తో సహా పలు నగరాలను ఆక్రమించుకున్నారు. దీంతో అసద్‌ తన కుటుంబంతో సహా రష్యాకు శరణార్థిగా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు. అధికార బదిలీపై తిరుగుబాటుదారులతో చర్చలు జరిపాకే అసద్‌ సిరియాను వీడారని రష్యా ప్రభుత్వం తెలిపింది. ఇక, అసద్‌ సిరియాను వీడిన వెంటనే నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిందని రెబల్స్ సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ రెబల్స్‌ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అస‌ద్ కుటుంబం సుమారు అయిదు ద‌శాబ్ధాల నుంచి సిరియాను పాలిస్తున్న‌ది. అయితే రెబ‌ల్స్ తిరుగుబాటుతో.. ఆదివారం దేశాన్ని విడిచి వెళ్లారు.

Related Posts
Mad Square : మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కు ఎన్టీఆర్ ..?
mad sm

సూపర్ హిట్ అయిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాలేజీ నేపథ్యంలో కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం, గత Read more

TDP: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.. ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు, లోకేశ్‌ నివాళి
TDP Foundation Day.. Chandrababu, Lokesh pay tribute to NTR statue

TDP: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఎన్టీఆర్‌ భవన్‌లో ఘనంగా జరింది. ఈ వేడుకలకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు , మంత్రి నారా లోకేశ్‌ హాజరయ్యారు. ఈ Read more

Chandrababu Naidu: బాణసంచా పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం
Chandrababu Naidu: బాణసంచా పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం

కైలాసపట్నం అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదం Read more

మన్మోహన్‌కు స్మారకమా..? ప్రణబ్ కుమార్తె విమర్శలు
pranab mukherjee daughter

మన్మోహన్ సింగ్ ప్రత్యేక స్మారకానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ Read more

×