MIC Electronics Ltd. has put forward budget targets for the year 2025

ఎంఐసీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 2025 బడ్జెట్ లక్ష్యాలు

హైదరాబాద్ : LED డిస్ప్లే మరియు లైటింగ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉన్న MIC ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (MICEL), రాబోయే కేంద్ర బడ్జెట్ 2025 పురస్కరించుకుని తమ అంచనాలను వివరించింది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో వృద్ధి మరియు ఆవిష్కరణలను పెంపొందించడానికి పరిశ్రమ-స్నేహపూర్వక విధానాల అవసరాన్ని నొక్కి చెప్పింది.

కంపెనీ అంచనాల గురించి MIC ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సీఈఓ రక్షిత్ మాథుర్ మాట్లాడుతూ.. “భారతీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు 2025 కేంద్ర బడ్జెట్ కీలకమైన సమయంలో వస్తుంది. పర్యావరణ అనుకూలమైన మరియు ఇంధన-సమర్థవంతమైన పరిష్కారాల దిశగా ప్రపంచం ప్రయాణిస్తోన్న వేళ, దేశీయ తయారీని బలోపేతం చేసే మరియు ఆర్&డి కార్యక్రమాలను ప్రోత్సహించే రీతిలో ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టడం చాలా అవసరం. అవి ప్రపంచవ్యాప్తంగా పోటీ పడటానికి వీలు కల్పిస్తాయి” అని అన్నారు.

image

“ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రపంచ కేంద్రంగా తనను తాను భారతదేశం నిలబెట్టుకున్నందున, PLI (ఉత్పత్తి-అనుసంధానిత ప్రోత్సాహకం) పథకానికి కేటాయింపులను పెంచడం, కీలకమైన ముడి పదార్థాలకు దిగుమతి సుంకాలను తగ్గించడం మరియు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టడం వంటి విధానాలు చాలా కీలకం” అని శ్రీ మాథుర్ తెలిపారు.

ఐఓటి, ఏఐ మరియు స్మార్ట్ లైటింగ్ సిస్టమ్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల (PPPs) ప్రాముఖ్యతను కూడా MIC ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైలైట్ చేసింది. ఫిబ్రవరి 1న సమర్పించనున్న యూనియన్ బడ్జెట్ 2025 ద్వారా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగంలో సవాళ్లు మరియు అవకాశాలను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడటానికి పరిశ్రమ నాయకులు మరియు వాటాదారులు ఆసక్తిగా ఉన్నారు.

Related Posts
ప్రముఖ తమిళ దర్శకుడు జయభారతి కన్నుమూత
Director Jayabharathi Dies

ప్రముఖ తమిళ దర్శకుడు జయభారతి (77) కిడ్నీ ఇన్ఫెక్షన్ కారణంగా చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో తమిళ చిత్ర పరిశ్రమలో విషాద Read more

ప్రపంచంలోనే అత్యధిక వయస్కుడు మృతి
world oldest man john alfre

ప్రపంచంలో అత్యధిక వయసుగల వ్యక్తిగా పేరొందిన జాన్ టిన్నిస్వుడ్ కన్నుమూశారు. ఆయన వయసు 112 ఏళ్లు. సౌత్ పోర్టులోని కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతూ జాన్ మృతిచెందినట్లు Read more

ఢిల్లీ బొమ్మలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే
ఢిల్లీ బొమ్మలపై .డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే

దేశ రాజధాని ఢిల్లీ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటం ప్రత్యేకంగా ప్రదర్శింపబడింది. ఈ శకటంలో ఏటికొప్పాక బొమ్మలు ఉన్న విషయం డిప్యూటీ సీఎం Read more

కుంభమేళాకు రానున్న ప్రధాని మోదీ..ఎందుకంటే?

ప్రయాగ్‌రాజ్ ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణి సంగమంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహాకుంభమేళా సందర్భంగా పుణ్యస్నానాలు చేయడానికి అనేక మంది ఇక్కడ చేరుకున్నారు. వసంత పంచమి రోజున రద్దీ Read more