ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ (MI) ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 200కి పైగా పరుగులు చేసిన ప్రతిసారీ విజయాన్ని ఖాయం చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు 15 మ్యాచుల్లో 200+ స్కోర్ చేసిన ముంబై టీమ్ ఆ ప్రతి మ్యాచ్‌ను గెలవడం గమనార్హం. ఇది ఐపీఎల్ చరిత్రలో మిగిలిన అన్ని జట్లకంటే భిన్నమైన విజయగాధగా నిలిచింది.
వరుసగా 13 మ్యాచ్‌లలో ఓటమి లేదు
ఇందులో మరో విశేషం ఏంటంటే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టూ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 200+ స్కోర్ చేసినప్పుడు వరుసగా 13 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూడలేదు. కానీ, ముంబై ఇండియన్స్ ఈ విభాగంలో ఢిల్లీ కంటే ముందుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మొత్తం 21 సార్లు 200కి పైగా స్కోర్ చేయగా, అందులో 5 మ్యాచుల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది వారికే కొంత దురదృష్టకరమైన అంశం.

SRH కూడా 15 మ్యాచ్ లలో విజయం
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) 200+ స్కోర్లు చేసిన 24 మ్యాచుల్లో 19 విజయాలు, 5 ఓటములు మూటగట్టుకుంది. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కూడా 17 సార్లు 200 పై స్కోర్లు చేసి అందులో 15 మ్యాచుల్లో విజయం సాధించింది, కేవలం 2 మ్యాచుల్లోనే ఓడిపోయింది. ఈ గణాంకాలు చూస్తే ముంబై ఇండియన్స్ స్థిరమైన ప్రదర్శన, మెరుగైన డెత్ ఓవర్ బౌలింగ్ మరియు మ్యాచ్‌ను డిఫెండ్ చేసుకునే సామర్థ్యం ఎంత ఉన్నత స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుస్తోంది.