మేష రాశి
10-01-2026 | శనివారంఇప్పటివరకు మరుగున పడిన సమస్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. మొదట కొంత ఆందోళన కలిగించినా, క్రమంగా వాటికి సరైన పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కుటుంబం, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో స్పష్టత ఏర్పడుతుంది.
ఋణాల విషయంలో ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. ఆలస్యంగా అయినా రావలసిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఖర్చులపై నియంత్రణ పాటిస్తే ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది.
మనోధైర్యంతో ముందడుగు వేస్తే విజయాలు దక్కుతాయి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. పెద్దల సలహా తీసుకుంటే అనుకున్న పనులు సాఫీగా పూర్తవుతాయి.
ఈరోజు ఫలితాలు
ఆరోగ్యం
80%
సంపద
100%
కుటుంబం
60%
ప్రేమ సంభందిత విషయాలు
100%
వృత్తి
80%
వైవాహిక జీవితం
100%