ఒడిషాకు చెందిన ప్రముఖ ఫోటోషాప్ కళాకారుడు, మీమ్స్ సృష్టికర్త అథియస్ట్ కృష్ణ (Atheist Krishna) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, జూలై 23న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కృష్ణ మృతితో సోషల్ మీడియా అభిమానుల్లో విషాదం నెలకొంది. చిన్న వయసులోనే అకాల మరణం చెందడం అందరినీ తీవ్ర విషాదంలో ముంచింది. అభిమానులు, స్నేహితులు, ప్రముఖులు ఆయన మృతి పట్ల శోక సందేశాలు వ్యక్తం చేస్తున్నారు.
మీమ్స్, ఫోటో ఎడిటింగ్‌కి కొత్త ఊపిరినిచ్చిన కళాకారుడు
కృష్ణ అసలు పేరు రాధాకృష్ణ సంగా. కానీ “Atheist Krishna” అనే పేరుతో సోషల్ మీడియాలో తనదైన శైలి కల మీమ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. హాస్య ప్రధానమైన ఫోటో ఎడిటింగ్‌తో పాటు, పాతదైన, దెబ్బతిన్న ఫోటోలను జీవం పోసేలా పునరుద్ధరించడంలోనూ తన ప్రత్యేకతను చూపించాడు. కృష్ణ నైపుణ్యం చాలామంది సెలబ్రిటీలను ఆకట్టుకుంది. తన అద్భుత ఫోటో ఎడిటింగ్ కళతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు.
ప్రధానమంత్రి నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల ప్రశంసలు
అథియస్ట్ కృష్ణ టాలెంట్‌పై దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ వంటి ప్రముఖుల దృష్టిని ఆకర్షించి, వారి ప్రశంసలు పొందడం ఆయన ప్రతిభకు నిదర్శనం. సామాన్యుల్లోనే అసాధారణ ప్రతిభ ఉంటుందని కృష్ణ తన పనితో నిరూపించారు. ఈ యువ కళాకారుడి మరణం దేశ వ్యాప్తంగా మీమ్స్ ప్రేమికులు, క్రియేటివ్ కమ్యూనిటీకి తీరని లోటుగా నిలిచింది.
Read Also ; Elephant : ఏనుగు దాడిలో మల్టీ మిలియనీర్ మృతి