Megastar receives lifetime achievement award

Chiranjeevi : జీవిత సాఫల్య పుర‌స్కారం అందుకున్న మెగాస్టార్‌

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లండన్‌లో ఉన్న విషయం తెలిసిందే. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌.. యూకే పార్లమెంట్‌లో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. ‘లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌’ (జీవిత సాఫల్య పురస్కారం) పురస్కారాన్ని చిరంజీవికి ప్రదానం చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకిగానూ చిరంజీవికి ఈ గౌరవం దక్కింది.

Advertisements
జీవిత సాఫల్య పుర‌స్కారం అందుకున్న

మెగా అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు

యూకే అధికార లేబర్‌ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా నేతృత్వంలో ఈ సత్కారం జరిగింది. పార్లమెంట్‌ సభ్యులు సోజన్‌ జోసెఫ్‌, బాబ్‌ బ్లాక్‌మాన్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. చిరంజీవిని సత్కరించి ఈ అవార్డు ఇచ్చిన వీడియోలు, ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. మెగా అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలానే తెలుగువారికి, దేశానికి మరిన్ని పేరు ప్రఖ్యాతలు చిరంజీవి తెచ్చిపెట్టాలంటూ ఆకాంక్షిస్తున్నారు.

‘గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌’ రికార్డుల్లోకి

ఇక చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో అవార్డులను అందుకున్నారు. గతేడాది మెగాస్టార్ ఏకంగా ‘గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌’ రికార్డుల్లోకి కూడా ఎక్కారు. 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల స్టెప్పులతో ఆడియన్స్‌ని అలరించినందుకు గాను చిరంజీవికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. అలానే పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందించి కేంద్ర ప్రభుత్వం చిరుని గౌరవించింది.

Related Posts
ఈసీ నిష్పక్షపాతంగా ఉండే వ్యవస్థ : సీఈసీ రాజీవ్ కుమార్
EC is an impartial system .. CEC Rajeev Kumar

ఎవరైనా తప్పు చేస్తే తమ వ్యవస్థ సహించదని వెల్లడి న్యూఢిల్లీ: లోక్‌సభతో పాటు ఆయా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ డేటా తారుమారు అయిందంటూ కొంతకాలంగా విపక్షాలు Read more

Moderate Rains : ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
rain alert

తెలంగాణలో రాబోయే 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో Read more

FASTag : నేటి నుంచి కొత్త రూల్స్.. లేటైతే రెట్టింపు బాదుడు
FASTag new rules from today

మీ ఫాస్టాగ్ ఓసారి చెక్ చేసుకోండి..లేదంటే ఇబ్బందులు న్యూఢిల్లీ: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించిన నిబంధనలు మార్చింది. ముఖ్యంగా బ్లాక్ Read more

చంద్రబాబు ప్రచారం చేసిన చోట బీజేపీ ముందు.
chandrababu naidu

చంద్రబాబు నాయుడు బీజేపీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ఆయన బీజేపీకి మద్దతు ప్రకటించి, తెలుగు ప్రజలతోపాటు అనేక మంది ఈ పార్టీకే ఓటు వేయాలని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×