ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదే పెద్ద అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేయాలని ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 15తో ముగిసింది.అధికారిక షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జూన్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, చాలా మంది అభ్యర్థులు ఒకే అభ్యర్థనతో ముందుకొస్తున్నారు. ప్రిపరేషన్‌కి కనీసం 90 రోజుల గడువు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఈ డిమాండ్‌పై లోకేశ్ స్పందన
ఈ నేపథ్యంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి Nara Lokesh స్పందించారు. “డీఎస్సీ ఆపేందుకు వైసీపీ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సిలబస్‌ను గతేడాది డిసెంబర్‌లోనే ప్రకటించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా ఏడు నెలల గడువు ఇచ్చాం” అని ఆయన స్పష్టం చేశారు.ఈ వ్యాఖ్యలతో డీఎస్సీ గడువు పొడిగింపు అంశానికి తుది క్లారిటీ వచ్చింది. మరి అభ్యర్థులు ఇప్పుడే సిద్ధమవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
2025 ఏపీ మెగా డీఎస్సీ పూర్తి షెడ్యూల్ ఇది
దరఖాస్తు & ఫీజు చెల్లింపు: ఏప్రిల్ 20 నుండి మే 15 వరకు
మాక్ టెస్టులు ప్రారంభం: మే 20 నుంచి
హాల్ టికెట్లు డౌన్‌లోడ్: మే 30 నుంచి
ఆన్‌లైన్ పరీక్షలు: జూన్ 6 నుంచి జులై 6 వరకు
ప్రాథమిక కీ విడుదల: పరీక్షల తర్వాత రెండో రోజే
అభ్యంతరాల స్వీకరణ: 7 రోజులపాటు
తుది కీ విడుదల: అభ్యంతరాల గడువు ముగిసిన 7 రోజుల్లో
మెరిట్ జాబితా: తుది కీ విడుదలైన 7 రోజులకు
అభ్యర్థులకు సూచన
ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. గడువు పెంపు ఆశల్ని వదిలేసి ఇప్పుడే ప్రిపరేషన్‌కి ముమ్మరం కావాలి. గతంలో సిలబస్ ప్రకటించినప్పటి నుంచి ఎంతో సమయం గడిచింది.
Read Also : TTD : టీటీడీ వివిధ ట్రస్ట్‌లకు ఎన్నారై భారీ విరాళం