ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లండన్ నుంచి స్వదేశానికి వచ్చిన సౌరభ్ తన పాప పుట్టిన రోజు వేడుకల కోసం ఎంతో ఉత్సాహంగా వచ్చాడు. కానీ, అతనికి తెలియని విషాదం ఎదురు చూస్తోంది. భార్య ముస్తాన్ రస్తోగి తన ప్రియుడు సాహిల్ సహాయంతో భర్తను హత్య చేసి, ప్లాస్టిక్ డ్రమ్ములో శరీరాన్ని ముక్కలు చేసి సిమెంట్‌తో కప్పిపుచ్చింది. ఈ దారుణాన్ని గుర్తించడంలో ఆరేళ్ల చిన్నారి మాటలు కీలకంగా మారాయి.

కన్నీటి కథ: ఆరేళ్ల చిన్నారి చూపిన దారి
ఈ అమానుష హత్యలో సౌరభ్, ముస్తాన్‌కు జన్మించిన ఆరేళ్ల చిన్నారి కీలకంగా మారింది. తండ్రి కనిపించడంలేదని అనుమానం వచ్చినప్పుడు, స్థానికులు ఆ చిన్నారిని అడిగారు – మీ నాన్న ఎక్కడ? అని. ఊహించని విధంగా చిన్నారి సమాధానం – “డ్రమ్ములో ఉన్నాడు” అని చెప్పింది. అప్పుడు ఎవరూ ఈ మాటల వెనక ఉన్న దారుణ నిజాన్ని ఊహించలేదు. తర్వాత, సౌరభ్ తల్లిదండ్రులు కొడుకు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. చిన్నారి చెప్పిన డ్రమ్ము కథనంపై పోలీసులు దృష్టి సారించడంతో అసలు విషయం బయటపడింది. ముస్తాన్ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు ఈ దారుణం చేసింది.
ప్రేమలో పడి భర్తను హత్య చేసిన ముస్తాన్
సౌరభ్, ముస్తాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట్లో వీరి వైవాహిక జీవితం సజావుగా సాగినప్పటికీ, కొంత కాలానికి ముస్తాన్ ప్రవర్తన మారిపోయింది. ఆమె ప్రియుడు సాహిల్‌తో సంబంధం కొనసాగించడంతో, భర్తను దూరం పెట్టాలని భావించింది. కానీ, సౌరభ్ తన కుటుంబాన్ని విడిచిపెట్టే ఉద్దేశ్యం లేకపోవడంతో ముస్తాన్ అతడిని హత్య చేయాలని పథకం వేసింది. సాహిల్‌తో తన భవిష్యత్‌ను కట్టిపడేసుకోవాలని భావించిన ముస్తాన్ సౌరభ్‌ను తొలగించేందుకు పక్కా ప్రణాళిక రచించింది. సౌరభ్ పుట్టిన రోజు వేడుకల కోసం ఇంటికి వచ్చిన రోజునే అతనిపై దాడి చేయాలని నిర్ణయించుకుంది. ముస్తాన్, సాహిల్ కలిసి సౌరభ్‌ను హతమార్చిన అనంతరం శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరించి ప్లాస్టిక్ డ్రమ్ములో దాచారు. ఆ తర్వాత సిమెంట్ పోసి దానిని కప్పిపుచ్చారు. ఇలా చేస్తే శరీరం డీకాల్ప్ అవకుండా ఎవరూ అనుమానించరని భావించారు.
సౌరభ్ కనిపించట్లేదనే అనుమానంతో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఆరేళ్ల చిన్నారి డ్రమ్ములో ఉన్నాడు అనే మాటలతో అనుమానం మరింత పెరిగింది. పోలీసులు ఆ ఇంట్లోని డ్రమ్మును విప్పి చూసినప్పుడు, అందులో సిమెంట్‌లో కప్పబడ్డ మృతదేహాన్ని గుర్తించారు. ఇది చూసిన పోలీసులకు షాక్ తగిలింది. హత్య చేసిన తీరు, శరీరాన్ని దాచేందుకు వేసిన పథకం చూసి వారు అబ్బురపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ముస్తాన్, సాహిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముస్తాన్ తల్లిదండ్రుల స్పందన ఒకవేళ తమ కూతురే ఈ హత్య చేసినట్టయితే ఆమెకు మరణశిక్ష తప్పదని ముస్తాన్ తల్లిదండ్రులే ఒప్పుకుంటున్నారు. అల్లుడిని హత్య చేసిన మా కూతురుకు భూమ్మీద బతికే అర్హత లేదు అని వారు పోలీసులకు వెల్లడించారు. ఈ ఘటన ఒక అమాయకపు చిన్నారి మాటలతో ఒక భయంకరమైన హత్య బయటపడిన కథగా మారింది.