हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Meenakshi Natarajan: జూబ్లీహిల్స్ ఆశావహుల్లో యమ టెన్షన్

Ramya
Meenakshi Natarajan: జూబ్లీహిల్స్ ఆశావహుల్లో యమ టెన్షన్

ఇప్పటికే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్న మీనాక్షీ నటరాజన్ (Meenakshi Natarajan)

పంజగుట్ట (హైదరాబాద్) : మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ఇప్పుడీమె పేరు జూబ్లీహిల్స్ ఆశావహుల్లో గుబులు రేపుతుంది. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. రాహుల్ గాంధీ కోర్ టీంలో ముఖ్యురాలు. ఈమెను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా నియమంచినప్పటి నుండి కాంగ్రెస్ నేతల్లో ఒకింత కంగారు మొదలైందని చెప్పవచ్చు. ఎలాంటి పైరవీలకు, రికమండే షన్లకు ఆమె లొంగరు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీకోసం పనిచేసిన వారికి న్యాయం చేయాలనే తపన ఆమెలో కనబడుతుంది. పైగా ఆమె చార్జ్ తీసుకున్న తర్వాత జరుగనున్న మొదటి ఎన్నిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావడంతో ఆమె దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలలో ఎవరికి మంచి ఆదరణ ఉందనే విషయాన్ని మాత్రమే ఆమె తెలుసుకుంటున్నారు. పార్టీని గెలుపుతీరాలకు చేర్చే నేతకే జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఆమె ఇప్పటికే నిర్ణయించుకుని అధిష్టానానానికి ఒక నివేదిక కూడా పంపారని విశ్వసనీయ సమాచారం. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయాలనుకునే ఆశావహులు యమా టెన్షన్ పడిపోతున్నారు. ఏఏ అంశాల ఆధారంగా ఆమె నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయంలో ఎలాంటి హింట్ బయటకు రాకపోవడంతో సీనియర్ నేతలు సైతం ఎవరికి టికెట్ కేటాయించబోతున్నారనే విషయంలో కనీసం అంచనా కూడా వేయలేకపోతున్నారు.

Meenakshi Natarajan: జూబ్లీహిల్స్ ఆశావహుల్లో యమ టెన్షన్
Meenakshi Natarajan: జూబ్లీహిల్స్ ఆశావహుల్లో యమ టెన్షన్

ముగ్గురు అభ్యర్థుల పేర్లతో నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం..

రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో సహజంగానే నాయకులకు గెలుపుపై ఆశలు పెరుగుతాయి .దీతో వివిధ వర్గాలకు సంబంధించిన నేతలు తమకు ఎందుకు అవకాశం ఇవ్వకూడదనే విషయంలో ఆధిష్టానానానికి బయోడేటాలు సమర్పిస్తున్నారు. సీయం రేవంత్ రెడ్డి (Revanth Reddy) డిప్యూటీసీయం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లను కలసి తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వవలసిందిగా వేడుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి స్థానికులే కాక పక్క నియోజకవర్గాల వారు, పక్క జిల్లాల వారు కూడా ఆసక్తి కనబరుస్తు న్నారు. ఇప్పటికే గతంలో పోటీచేసి ఓటమి పాలైన క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) తాను పోటీలో ఉన్నాని అధిష్టానం తనకే టికెట్ కేటా యిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ఈ విషయంలో ఆయన భహిరంగంగానే తన అభిలాషను వ్యక్తం చేశారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తన పదవి కాలం ఫిబ్రవరిలో ముగి స్తున్న నేపథ్యంలో ఉప ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి సాధించాలని దృష్టి పెట్టారు.

జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఆశావహుల హోరాహోరీ పోటీ

మరోనేత నవీన్ యాదవ్ కూడా తనకు టికెట్ దక్కుతుందనే ఆశాభావంతో ఉండి డివిజన్లలో తన అను చరులను యాక్టివ్ చేస్తున్నారు. గతంలో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం కాబట్టి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పీజెఆర్ కుమార్తె, ప్రస్తుత ఖైరతాబాద్ కార్పొరేటర్ పి. విజయారెడ్డి కూడా కోరుతున్నారు. అదేవిధంగా నాంపల్లికి చెందిన సీనియర్ మైనారిటీ నేత ఫిరోజ్ ఖాన్ కూడా తన ప్రయత్నాల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వీరు కాక మాజీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసు మకుమార్ కూడా అవకాశం ఇస్తే పోటీ చేయా లనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. వీరు కాక మరో ఐదుగురు ఆశావహులు అంతర్గతంగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

మీనాక్షి నటరాజన్‌ చేతిలో కీలక నిర్ణయం

ఈ విషయంలో సీయం, డిప్యూటీసీయం, పీసీసీ చీఫ్ లు తమ వద్దకు వచ్చిన వారికి ఎలాంటి భరోసా ఇవ్వకుండా అధిష్టానం ఆలోచనకే ఓకె చెప్పాలనే నిర్ణయూనికి వచ్చినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కోర్టులో బంతి ఉండ డంతో ఆమె ప్రసన్నం కోసం ఆశావహులు రకర కాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ పై ఓ నిర్ణయూనికి వచ్చిన ఆమె పూర్తి స్థాయి నివేదికను, ఎవరికి టికెట్ కేటాయిస్తే గెలుపు సాధ్యమనే విషయం ముగ్గురు పేర్లతో ఎఐసీసీ చీఫ్ ఖర్గేకు, ముఖ్యనేత రాహుల్గాంధీకి పంపిన ట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో వడపోతలో తమ పేరు ఉందో లేదోనని ఆశావ హుల్లో టెన్షన్ మొదలైంది. సీయం రేవంత్ రెడ్డి మాత్రం అభ్యర్థి ఎవరనే విషయంతో సంబంధం లేకుండా జూబ్లీహిల్స్లో గెలుపు తథ్యమని అధి ష్టానానికి భరోసా ఇచ్చినట్లు సమాచారం.

మీనాక్షి నటరాజన్ ఎవరు?

మీనాక్షి నటరాజన్ (జననం: 23 జూలై 1973)一 భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె 2009 నుండి 2014 వరకు ఒక్కసారి మాత్రమే పార్లమెంటు సభ్యురాలిగా మంధ్‌సోర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు.

హూ ఇస్ మీనాక్షి నటరాజన్ ఇన్ తెలంగాణ?

మీనాక్షి నటరాజన్ తెలంగాణలో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె గతంలో మధ్యప్రదేశ్‌లోని మందసూర్ పార్లమెంటు సభ్యురాలిగా (2009–2014) పనిచేశారు. ప్రస్తుతం ఆమె తెలంగాణలో పార్టీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై సమీక్ష చేసి, ఏఐసీసీకి నివేదికలు అందజేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Ponnam Prabhakar: బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం రూ.20 కోట్లు నిధులు : మంత్రి పొన్నం ప్రభాకర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870