money robbery

రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ దొంగతనం చోటుచేసుకుంది. పూర్తీ వివరాల్లోకి వెళితే.. అనంతపురం నగర శివారులో దొంగలు బీభత్సం సృష్టించారు. శివారెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో కూతురు పెళ్లి కోసం ఉంచిన నగదు, రూ.కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకెళ్లారు. పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం నగర శివారులోని బెంగుళూరు – హైదరాబాద్ హైవే సమీపంలో సవేరా ఆస్పత్రి వెనుక వైపు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి రాజహంస విల్లాస్‌లో బుధవారం భారీ చోరీ జరిగింది. దుండగులు బీరువాలో దాచి ఉంచిన రూ.20 లక్షల నగదుతో పాటు ప్రత్యేక లాకర్‌లో ఉంచిన రూ.3.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.

Advertisements

ఫిబ్రవరిలో కుమార్తె పెళ్లి ఉండడంతో బంగారం, డబ్బు అంతా ఇంట్లోనే ఉంచుకున్నట్లు వ్యాపారి దంపతులు తెలిపారు. పెళ్లి కార్డులు బంధువులకు ఇవ్వడానికి వెళ్లినప్పుడు దొంగతనం జరిగినట్లు చెప్పారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts
శ్వేతపత్రాలపై ఏం చేశారు…? అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
New law in AP soon: CM Chandrababu

అధికారంలోకి వచ్చి రాగానే చంద్రబాబు ..గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అంశాలపై శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పత్రాల్లో అనేక అంశాలను ప్రస్తావించి వీటిపై Read more

అమెరిక పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేశ్‌
Minister Nara Lokesh who went on a visit to America

శాన్‌ఫ్రాన్సిస్కో : ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్నారు. ఈ సదర్భంగా అక్కడ Read more

మహిళా ఎస్సైపై యువకుల దాడి..చివరికి ఏమైంది?
గుడివాడలో మహిళా ఎస్సైపై దాడి.. పోలీసులు ఏం చేశారు?

విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సంప్రదాయంగా ప్రతి ఏటా నిర్వహించే ఈ జాతరలో డాన్స్‌ Read more

యోగి సర్కారు పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు
pawan yogi govt

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొన్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కుంభమేళా నిర్వహణపై వస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన పవన్, Read more