Massive encounter in Chhattisgarh... 8 Maoists killed

ఎదురు కాల్పులు.. 8 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లా గంగులూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. మావోయిస్టుల గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గంగులూర్‌ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్‌కు మధ్య ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది.

image

ప్రస్తుతం ఇంకా మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది. ఇటీవల కాలంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగులుతున్నది. పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి చలపతితో పాటు 16 మంది వరకు మావోలు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. తాజాగా జరిగిర ఎన్‌కౌంటర్‌లో మరో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు.

కాగా, మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. హామీ ఇచ్చినప్పటి నుంచి.. నక్సల్స్‌కు వరుసగా భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నక్సల్స్ ఏరివేతలో భాగంగా కూంబింగ్ ఆపరేషన్లు చేస్తున్న పోలీసులు, భద్రతా బలగాలు.. మావోయిస్టులకు ఎప్పటికప్పుడు షాక్ ఇస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో తరచూ సెక్యూరిటీ ఫోర్స్, నక్సల్స్‌కు మధ్య జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు.

Related Posts
కేటీఆర్‌ఫై విచారణకు గవర్నర్ ఆమోదం
KTR Congress

తెలంగాణలో చలికాలంలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నది. ఇక్కడి రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకోనుంది. ఫార్ములా ఈ-కారు రేసులో అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, Read more

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మూడవ ఎడిషన్ ప్రారంభం
Royal Stag Boombox launched their third edition in Hyderabad

హైదరాబాద్ : ‘లివింగ్ ఇట్ లార్జ్’ యొక్క స్ఫూర్తిని సంబరం చేస్తూ, సీగ్రామ్ రాయల్ స్టాగ్ హైదరాబాద్, తెలంగాణాలో బౌల్డర్ హిల్స్ లో జనవరి 25న గొప్ప Read more

నేడు వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
Today ycp statewide agitations on the increase in electricity charges

అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుపై నేడు(శుక్రవారం) ప్రతిపక్ష వైసీపీ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా Read more

లక్నోలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు
Bomb threat to Taj Hotel in Lucknow

లక్నో: లక్నోలోని తాజ్ హోటల్‌కు సోమవారం ఒక ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అయితే, ఈ నగరంలో ఇప్పటికే 10 హోటళ్లకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *