Masood Azhar : విరుచుకుపడిన లేఖ – మోడీపై తీవ్ర హెచ్చరికలు
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాద సంస్థలపై కర్రెత్తిన దాడిగా నిలిచింది. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలను సమన్వయంతో ధ్వంసం చేయడంతో పాక్‌కు తీవ్ర దెబ్బ తగిలింది. ఈ దాడుల్లో లష్కరే తోయిబా అధినేత మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు సహా 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో అతడి సోదరి, బావ, మేనల్లుడు సహా పదిమంది కుటుంబ సభ్యులు ఉండగా, మరో నలుగురు సహాయకులు కూడా హతమయ్యారని మసూద్ అజహర్ స్వయంగా పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలో మసూద్ అజహర్ స్పందిస్తూ, తనను కూడా చంపేసేవారైతే బాగుండేదని అన్నాడు. తన కుటుంబాన్ని కోల్పోయిన మసూద్, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశాడు. కాశ్మీర్ విషయంలో అన్ని నియమనిబంధనలను మోడీ ఉల్లంఘించారంటూ అసహనం వ్యక్తం చేశాడు. భారత్‌పై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని, ఇకపై ఎలాంటి జాలీ చూపించమని తన లేఖలో హెచ్చరించాడు.

Masood Azhar : మసూద్ అజహర్ లేఖతో సంచలనం
ఆయన విడుదల చేసిన లేఖల్లో “నాకు భయమేమీ లేదు, నేను బాధపడడం లేదు, మృతిచెందిన వారిపై దుఃఖించట్లేదు. కానీ భారత ప్రధాని మోడీకి దీటైన బదులు తప్పకుండా ఇస్తాం” అంటూ మసూద్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ లేఖలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు దీనిని తీవ్రంగా పరిగణించగా, మరోవైపు మసూద్ ప్రకటనల నేపథ్యంలో భారత్ తలదించే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది.
Read More : Seethakka : పిల్లల భవిష్యత్తు ను తీర్చిదిద్దేది అంగన్వాడీ టీచర్లే: సీతక్క