Aghori : తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ అంశం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు వివాదాలకు మూల కారణమైన అఘోరీ మరో సంచలనానికి తెర లేపింది. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన వర్షిణి అనే యువతిని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ చిన్న ఆలయంలో అఘోరీ, వర్షిణీ మెడలో తాళికట్టగా.. ఇద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకోవడంతో పాటు ఏడడుగులు కూడా కలిసి నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో దర్శనమిచ్చాయి. అక్కడే ఉన్న పలువురు భక్తులు ఉత్సహంగా భక్తి పాటలు పాడుతూ వారిని ఆశీర్వదించారు.
లేడీ అఘోరీపై కఠిన చర్యలు
అఘోరీ మొదటి భార్యను తానే అంటూ ఓ యువతి సోమవారం సంచలన ప్రకటన చేసింది. అల్లూరి శ్రీనివాస్ జనవరి 1న తనను పెళ్లి చేసుకున్నాడని, అనంతరం జనవరి 13న వర్షిణీ అనే అమ్మాయిని కూడా వివాహం చేసుకున్నాడని ఆరోపించింది. మొదటి భార్యను తాను ఉండగా.. ఇంకో అమ్మయిని ఎలా పెళ్లి చేసుకుంటాడని ప్రశ్నించింది. తనకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగొద్దనే తాను మీడియా ముందుకు వచ్చానని చెప్పుకొచ్చింది. పోలీస్ శాఖ, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు లేడీ అఘోరీపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత యువతి కోరింది.
Read Also: నేడు జపాన్‌కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి