జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి 26మంది మరణించిన ఘటన విశ్వ
వ్యాప్త సంచలన ఘటన. ఈ ఘటన తర్వాత భారత్ తన ప్రతీకార దాడులకు పాల్పడింది.
పాకిస్థాన్ పై ‘ఆపరేషన్ సింధూర్’ (‘Operation Sindoor’) పేరుతో యుద్ధానికి దిగింది. ప్రస్తుతం రెండు దేశాలుకాల్పుల విరమణ ఒప్పందంలో ఉన్నాయి. అయితే తాజాగా ఈ దాడికి సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)’ను ఉగ్రవాద సంస్థగా అమెరికా (America) గుర్తించింది. ఈ సంస్థ పాకిస్థాన్ కేంద్రంగా
పనిచేస్తున్న లష్కరే తొయిబా ముసుగు సంస్థగా అమెరికా విదేశాంగ మంత్రి మర్కో
రూబియో పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని భారత్ ప్రభుత్వం స్వాగతించింది.

రెండు దేశాలమధ్య బలమైన సహకారం..
ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికాల మధ్య బలమైన సహకారానికి మరో
నిదర్శనమిది. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రమూ సహించకూడదు’ అని విదేశీ వ్యవహారాల
శాఖ పేర్కొంది. ఉగ్రదాడిలో 26మంది ప్రాణాలు కోల్పోయారు. టీఆర్ఎఫ్ అధిపతి షేక్
సజ్జద్ గుల్ను పహల్గాం దాడికి ప్రధాన సూత్రధారిగా ఎన్ఐఏ గుర్తించింది. టీఆర్ఎఫ్
2019లో ఆవిర్భవించింది. తొలుత ఆన్లైన్ సంస్థగా ప్రారంభమై, ఆరు నెలలు గడిచేసరికి
లష్కరే తొయిబా సహా పలు సంస్థల ఉగ్రవాదులను చేర్చుకొని భౌతిక ముఠాగా
రూపుదిద్దుకుంది. ‘అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడేందుకు, ఉగ్ర
వాదంపై పోరాడేందుకు, పహల్గాం దాడి (Pahalgam attack) కి న్యాయం చేయడానికి ట్రంప్ పిలుపునిచ్చారు.పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ, భారత్పై దాడులకు పాల్పడుతూ ఉంది.
రెండుదేశాల మధ్య విభేధాలు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి.
మర్కో రూబియో ఎవరు?
మర్కో రూబియో (Marco Rubio) అమెరికాలోని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన రిపబ్లికన్ పార్టీకి చెందినవారు, ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన అమెరికా సెనేట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు.
మర్కో రూబియో ఎప్పుడు జన్మించారు?
మర్కో రూబియో 1971 మే 28న మియామి, ఫ్లోరిడాలో జన్మించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also : Narendra Modi: వచ్చేవారంలో మాల్దీవులకు పర్యటించనున్న మోదీ