Manish Sisodia defeat!

మనీష్ సిసోడియా ఓటమి !

న్యూఢిల్లీ : జంగ్పూరాలో మనీష్ సిసోడియాకు బిగ్ షాక్ తగిలింది. జంగ్పూరాలో మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ గెలిచారు. 600 ఓట్ల తేడాతో సిసోడియా ఓటమి పాలయ్యారు.. సిసోడియాను జైలుకు వెళ్లొచ్చిన సానుభూతి .గట్టెక్కించలేకపోయింది. దీంతో సిసోడియా తీవ్ర నిరాశకు గురయ్యారు.

Advertisements

ఇక, షాకుర్ బస్తీ నుంచి బరిలోకి దిగిన సత్యేంద్ర జైన్ 19 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి కర్నాల్ సింగ్ గెలిచారు. ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీళ్లు ముగ్గురు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన వారే. 2022 మే 31న ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్‌ను లిక్కర్‌ స్కామ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. 2023 ఫిబ్రవరి 26న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టయ్యారు.

image

కాగా, అటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ వచ్చింది. గత రెండు ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైన బీజేపీకి ఈసారి పూర్తి ఆధిక్యం సాధించింది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ వచ్చింది. అటు హ్యాట్రిక్ కొట్టలేకపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ రెండో అతిపెద్ద పార్టీలో ఢిల్లీ ఎన్నికల్లో నిలిచింది. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజక వర్గంలో 9 రౌండ్లు ముగిశాక 1,170 ఓట్ల వెనుకంజలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఒక్క నియోజకవర్గంలో కూడా ఆధిక్యంలో లేని కాంగ్రెస్ డీలా పడింది. ఇక అటు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ రావడంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Related Posts
తిరుపతిలో టోకెన్లు ఇస్తున్న సంగతి కూడా నాకు తెలియదు – సీఎం చంద్రబాబు
cbn pm

తిరుపతిలో సంభవించిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం Read more

శంషాబాద్‌‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
Bomb threat to Shamshabad Airport

హైదరాబాద్‌: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. గురువారం ఉదయం ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సైబరాబాద్ కంట్రోల్‌రూమ్‌కు ఓ ఆగంతకుడుకు ఫోన్ చేసి Read more

మోడీ నాకు అన్నయ్య, గురువు : భూటాన్‌ ప్రధాని
Prime Minister Modi is my elder brother and mentor.. Prime Minister of Bhutan

ప్రధాని మోడీ నాయకత్వంపై భూటాన్‌ ప్రధాని ప్రశంసలు న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన స్కూల్‌ ఆఫ్‌ అల్టిమేట్‌ లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్గే పాల్గొన్నారు. ఈ Read more

అంగన్ వాడీ లకు చీరలు ఇచ్చేందుకు సర్కార్ సిద్ధం
telangana anganwadi

తెలంగాణ రాష్ట్రం అంగన్ వాడీ (Anganwadis) టీచర్లకు, హెల్పర్లకు గిప్ట్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నందున, ప్రతి టీచర్‌కు మరియు హెల్పర్‌కు Read more