Mangalagiri Police Notices to YCP Leaders Sajjala Ramakrishna Reddy

సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసుల నోటీసులు

అమరావతి: తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతల మెడ చుట్టూ బిగుసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నేతలను విచారించిన పోలీసులు తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీచేశారు. విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల ప్రమేయం కూడా ఉందని గుర్తించిన పోలీసులు ఆయన దేశం విడిచి పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. దీంతో నిన్న ఆయనను ఢిల్లీ విమానాశ్రయం పోలీసులు అడ్డుకుని తిరిగి వెనక్కి పంపారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ఆయనకు నోటీసులు జారీచేశారు.

19 అక్టోబర్ 2021న వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. ఈ కేసులో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురాంలను పోలీసులు ఇప్పటికే పలు దఫాలుగా పిలిచి, విచారించారు. కేసు కీలక దశలో ఉండడంతో దాడితో ప్రమేయం ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ ముఖ్య నేతలను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే సజ్జలకు నోటీసులు జారీ చేశారు.

Related Posts
ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం: మంత్రి
uttam

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులో ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఈ పథకం Read more

నేడు ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన
Osmania Hospital new

హైదరాబాద్ నగరంలో త్వరలోనే ఒక అత్యాధునిక సదుపాయాలతో కూడిన కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవనం నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన Read more

పిక్నిక్ వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్..
gang rape on pharmacy stude 1

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని రేవా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఐదుగురు దుండుగులు ఒక మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. వివాహిత దంపతులు పిక్నిక్‌ కోసం Read more

హైదరాబాద్ డెలివరీ సెంటర్‌తో భారతదేశంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తోన్న గ్లోబల్‌లాజిక్
GlobalLogic further expanding its operations in India with Hyderabad delivery center

హైదరాబాద్: హిటాచీ గ్రూప్ కంపెనీ మరియు డిజిటల్ ఇంజనీరింగ్‌లో అగ్రగామిగా ఉన్న గ్లోబల్‌లాజిక్ ఈరోజు హైదరాబాద్‌లో తమ నూతన డెలివరీ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆసియా పసిఫిక్ Read more