వాణి కపూర్, సుర్వీన్ చావ్లా, శ్రియా పిల్గాంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ వెబ్ సిరీస్ ‘మండల మర్డర్స్’(Mandala Murders Review) ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ (Streaming on Netflix) అవుతోంది. గోపీ పుత్రన్, మనన్ రావత్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్లతో రూపొందింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్ విభిన్న జోనర్స్‌ను స్పృశిస్తూ సాగుతుంది.ఈ కథ ఉత్తరప్రదేశ్‌లోని చరణ్ దాస్ పూర్ గ్రామంలో 1952లో ప్రారంభమవుతుంది. అడవిలో రుక్మిణి అనే మంత్రగత్తె, తన అనుచరులతో కలిసి రహస్య ప్రదేశంలో నివసిస్తుంది. ఆమెకు బొటనవ్రేలు సమర్పిస్తే కోరికలను తీర్చుతుందని గ్రామస్థులు నమ్ముతారు. కానీ గ్రామ ప్రజలు కలసి ఆమెను తరిమివేస్తారు.గ్రామం నుంచి ఢిల్లీకి వెళ్లిన విక్రమ్ (వైభవ్ రాజ్ గుప్తా) పోలీస్ ఆఫీసర్ అవుతాడు. సస్పెన్షన్ తర్వాత తండ్రితో కలిసి స్వగ్రామానికి వస్తాడు. తల్లి గతంలో అడవికి వెళ్లి తిరిగి రాలేదని తెలుసుకుంటాడు. స్నేహితుడు ప్రమోద్ సాయంతో తల్లి ఆచూకీ తెలుసుకోవాలని నిర్ణయిస్తాడు.

హత్యలతో గ్రామం కలకలం
అదే సమయంలో సుజయ్, విజయ్ అనే అన్నదమ్ములు రౌడీయిజం చెలాయిస్తూ ఉంటారు. రాజకీయాలలో ఎదగాలని ప్రయత్నిస్తారు. కానీ అనన్య భరద్వాజ్ (సుర్వీన్ చావ్లా) వాళ్లను అడ్డుకుంటుంది. ఆ సమయంలో సుజయ్, విజయ్‌తో పాటు అభిషేక్ అనే యువకుడు హత్యకు గురవుతారు. శవాలపై విచిత్ర చిహ్నాలు కనిపించడం మిస్టరీని పెంచుతుంది.ఈ కేసును ఛేదించేందుకు రియా థామస్ (వాణి కపూర్) అనే స్పెషల్ ఆఫీసర్ గ్రామానికి వస్తుంది. ఆమె దర్యాప్తులో ఎదురయ్యే సవాళ్లు, విక్రమ్ తన తల్లిని కలుసుకుంటాడా అనే ఆసక్తి కథలో కొనసాగుతుంది.
విశ్లేషణ
కథలో పోలీస్ యాక్షన్, గ్రామీణ రాజకీయాలు, కుటుంబ భావోద్వేగాలు, క్షుద్రశక్తులు అన్నీ కలగలసి ఉన్నాయి. స్క్రీన్‌ప్లే చక్కగా అల్లబడింది. ప్రధానంగా నాయికలే కథను నడిపించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. కథ మలుపులు ఊహించలేని విధంగా ఉంటాయి.ఫొటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ అన్నీ మెప్పించాయి. ఫారెస్ట్, నైట్ ఎఫెక్ట్ సన్నివేశాలు బాగా వేశారు.‘మండల మర్డర్స్’ విభిన్న జోనర్స్‌ను కలిపిన సిరీస్. పాత్రలు ఎక్కువైనా కథ ఆకట్టుకుంటుంది. కొన్ని హింసాత్మక సన్నివేశాలు ఉన్నా, థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవారికి ఇది తప్పక నచ్చుతుంది.
Read Also : Kingdom : 28న ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ కు ఏర్పాట్లు!