mandakrishna

రేవంత్ సర్కార్ కు మాదిగలు బుద్ధి చెబుతారు -మందకృష్ణ

SC వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రేవంత్ సర్కార్ కు మాదిగలు బుద్ధి చెబుతారని MRPS అధ్యక్షుడు మందకృష్ణ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు (బుధవారం) 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు అదించనున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ తర్వాతే నియామకాలు చేపడతామని మాటిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాటతప్పారంటూ మందకృష్ణ ధ్వజమెత్తారు. ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలు చేస్తూ ఆర్డినెన్స్ తెస్తామని ఆయన అసెంబ్లీలో చెప్పారని, కానీ ఇప్పుడు ఎలాంటి వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకురాకుండానే 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు ఎలా అందజేస్తారని ప్రశ్నించారు.

దీనివల్ల తమ మాదిగ వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, మొత్తం 11 వేల పోస్టుల్లో ఎస్సీలకు1,650 పోస్టులు రావాల్సి ఉండగా, వాటిలో 1,100 పోస్టులు మాదిగ, మాదిగ ఉప కులాలకు రావాల్సి ఉందని, కానీ వర్గీకరణ చేపట్టకపోవడంతో కనీసం తమకు 600 పోస్టులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం తమకు వర్గీకరణ జరగాలని, దానికి అనుగుణంగా ఉద్యోగాల్లో వాటా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. DSC నియామకాలను నిరసిస్తూ MRPS రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది.

Related Posts
గ్రూప్‌-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : చంద్రబాబు
మేలో తల్లికి వందనం.. చంద్రబాబు కీలక ప్రకటన

రోస్టర్‌ విధానంపై అభ్యర్థులు 3 రోజులుగా ఆందోళన అమరావతి: ఏపీలో గ్రూప్-2 పరీక్షలపై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. Read more

అదుపులోనే ప్ర‌యాగ్‌రాజ్‌లో ప‌రిస్థితి: సీఎం యోగి
Situation in Prayagraj under control.. CM Yogi

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్ర‌యాగ్‌రాజ్ కుంభ‌మేళాలో జ‌రిగిన తొక్కిస‌లాట‌పై మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం ప్ర‌యాగ్‌రాజ్‌లో ప‌రిస్థితి అదుపులో ఉన్న‌ట్లు చెప్పారు. దాదాపు 8 నుంచి Read more

ముంబైలో 113 మరియు 103 ఏళ్ల వృద్ధుల ఓటు హక్కు: యువతరానికి సందేశం
MAHARASTHRA ELECTION

ముంబైలో ఓటు హక్కును వినియోగించిన ఇద్దరు వృద్ధుల కథ మనసును హత్తుకుంది. 113 ఏళ్ల వృద్ధురాలు నేపియన్ సముద్ర రోడ్డు నుండి, మరియు 103 ఏళ్ల వృద్ధుడు Read more

ఢిల్లీ మహిళలకు కొత్త సీఎం ‘ఉమెన్స్ డే’ గిఫ్ట్
New CM's 'Women's Day' gift to Delhi women

మహిళల అకౌంట్లలో రూ.2500 జమ న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా నగర ప్రజలకు శుభవార్త చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్చి 8 Read more